Home » Election Commission
మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల స్టార్ క్యాంపెయినర్లు చేస్తున్న ప్రసంగాలు గాడి తప్పుతున్నాయంటూ ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తూ.చ. తప్పకుండా పాటించేలా స్టార్ క్యాంపెయినర్లకు సూచించుకోవాలని బీజేపీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులకు వేర్వేరు నోటీసుల్లో ఈసీ ఆదేశించింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) వైసీపీ (YSRCP) పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. పల్నాడు, నర్సారావుపేట, అనంతపురంలోని తాడిపత్రి, తిరుపతిలో పెద్దఎత్తున వైసీపీ మూకలు హింసకు పాల్పడ్డారు. అలాగే వైసీపీ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.
ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. హౌస్ అరెస్ట్‌లో ఉండగా పిన్నెల్లి సోదరులు ఎలా తప్పించుకుంటారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిలదీశారు.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈవీఎంని పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్టారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. సంగారెడ్డి సమీపంలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని..