Home » Elections
ప్రధాని నరేంద్ర మోదీ నేటి నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మోదీ వారం రోజుల్లో దాదాపు పది ర్యాలీలు నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రచారం వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లికాని ప్రసాదులకు విచిత్ర హామీ ఇచ్చిన ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రష్యా ఉక్రెయిన్ వార్ అంశం ట్రంప్ ప్రధాన ఎజెండాలలో ఒకటి కావచ్చని నిపుణులు అంటున్నారు.
హోరాహోరీగా ప్రచారం కొనసాగిన 47వ అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం తుది అంకానికి చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా వేర్వేరు కాలమానాల ప్రకారం.. ఆయా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచి పోలింగ్ ప్రారంభమైంది.
ఎన్నికల్లో పార్టీల అనుకూల-ప్రతికూల-తటస్థ అంశాలకు అనుగుణంగా అమెరికాలోని రాష్ట్రాలను మూడుగా విభజించారు. అవి.. రెడ్, బ్లూ, స్వింగ్ రాష్ట్రాలు. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తూవస్తున్న రాష్ట్రాలను రెడ్ స్టేట్స్ అంటారు.
రాజకీయ వ్యూహకర్త, జాన్ సూరజ్ పార్టీ కన్వీనర్ ప్రశాంత్ కిషోర్ తొలిసారిగా తన ఫీజుల గురించి వెల్లడించారు. ఏదైనా రాజకీయ పార్టీ లేదా నేతలకు సలహాలు ఇస్తే ఎన్ని కోట్ల రూపాయలు తీసుకుంటానో వెల్లడించారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.
అగ్రరాజ్యం అమెరికా ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. సోమవారం వరకే గడువు ఉండడంతో.. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్ స్వింగ్ రాష్ట్రాలు-- విస్కాన్సిన్, నార్త్ కరోలినా, మిషిగాన్, జార్జియా, పెన్సిల్వేనియాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
జమిలి ఎన్నికలకు ముహూర్తం ఎప్పుడు? మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత ఈ ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని..
మహారాష్ట్రలోని అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మహారాష్ట్రలో ప్రధానంగా ``మహాయుతి``, ``మహా వికాస్ అఘాడీ`` కూటములు పోటీ పడుతున్నాయి. అయితే మాన్ఖుర్ద్ శివాజీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం విషయంలో మాత్రం మహాయుతి కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి.
జార్ఖండ్లో ఎన్నికల టైం దగ్గర పడింది. ప్రధాన పార్టీల నేతలు ప్రజలను మభ్యపెట్టేందుకు భారీ వాగ్దానాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఈరోజు కీలక హామీలను ప్రకటించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.