Delhi Assembly Elections 2025: ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బూత్‌లకు బెలూన్లు ఏర్పాటు..
ABN , Publish Date - Feb 05 , 2025 | 06:35 AM
ఈరోజు జరగనున్న ఢిల్లీ ఎన్నికల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రభుత్వం పలు రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే మహిళలు, PwD ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా పింక్ కలర్ బూత్‌లు ఏర్పాటు చేసింది.

దేశ రాజధానిలో ఢిల్లీలో ఈరోజు (ఫిబ్రవరి 5న) జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections 2025) ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (MCD) అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో పాల్గొనే ఓటర్ల కోసం, ప్రత్యేకంగా మహిళలు, వికలాంగుల (PwD) ఓటర్ల కోసం ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేశారు.
పింక్ బూత్‌లు..
పింక్ కలర్ రంగుల్లో బూత్‌లు ఏర్పాటు చేసి, బెలూన్ల తోరణాలతో ఆకర్షణీయంగా సిద్ధం చేశారు. పింక్ బూత్‌లు "మహిళలను నడిపించడం, దేశాన్ని నడిపించడం" అనే థీమ్‌ను ప్రతిబింబిస్తున్నాయి. ఇక PwD ఓటర్ల కోసం ఏర్పాటు చేసిన బూత్‌లో "సాధించినవారు" అనే థీమ్‌ను ప్రదర్శించారు. ఈ థీమ్ ద్వారా వివిధ రంగాలలో దివ్యాంగుల విజయాలను ప్రదర్శించే స్టాండ్‌లు ఏర్పాటు చేశారు.
ఈ ఎన్నికలు ఎప్పటివరకంటే..
ఈ ఎన్నికలు నేడు 7 గంటల నుంచి సాయంత్రం 6:30 గంటల వరకు ఒకే దశలో నిర్వహించబడతాయి. ఓట్ల లెక్కింపు ఫిబ్రవరి 8న జరగనుంది. పింక్ బూత్‌లలో మహిళలు తమ పాత్రను మరింత బలంగా చూపిస్తూ, దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల బలం, నేతృత్వం, ప్రగతి కోసం మహిళల పోరాటంపై ప్రత్యేక దృష్టి సారించారని చెబుతున్నారు. ఈ క్రమంలో మహిళా ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, సజావుగా ఓటింగ్ ప్రక్రియను నిర్వర్తించే లక్ష్యంతో ఈ చొరవను తీసుకొచ్చారు. ఈ బూత్‌లు మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు కేవలం ఒక స్థలం మాత్రమే కాకుండా, వారిని ప్రేరేపించే ఒక చర్యగా మారిపోయాయి. ఈ కార్యక్రమం మహిళల స్థానాన్ని ఎన్నికల వ్యవస్థలో మరింత బలపరిచేందుకు ఉపకరిస్తుందని చెప్పవచ్చు.
పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనున్నాయి. దీని కోసం మొత్తం 13,766 పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలలో 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికల కమిషన్ ఓటర్ల సౌకర్యానికి, Q మేనేజ్‌మెంట్ సిస్టమ్ (QMS) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ ద్వారా ఓటర్లు తమ ఎన్నికల కేంద్రాల్లో జనసమూహ స్థాయిలను నిజ సమయంలొ తనిఖీ చేసుకోవచ్చు.
ఢిల్లీలో ఓటర్ల సంఖ్య
ఈ ఎన్నికల్లో 13,766 పోలింగ్ స్టేషన్లలో 1.56 కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఓటర్లలో 83.76 లక్షల మంది పురుషులు, 72.36 లక్షల మంది మహిళలు, 1,267 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో పోటీ
2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ కొనసాగుతోంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న రాజకీయ పార్టీ, దేశ రాజధానిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అర్హత పొందుతుంది.
ఇవి కూడా చదవండి:
8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా
Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..
RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Read More Business News and Latest Telugu News