Share News

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు

ABN , Publish Date - Feb 05 , 2025 | 10:25 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7 గంటల నుంచి మొదలైంది. ఈ క్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోపాటు పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల పోలింగ్.. రాష్ట్రపతి నుంచి రాహుల్ వరకు ఓటేసిన ప్రముఖులు
Delhi Assembly Elections 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ఓటింగ్ ఈరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. ఈ క్రమంలో ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా కేంద్రాల వద్ద బారులు తీరారు. ప్రజాస్వామ్య పండుగలో భాగంగా రాష్ట్రపతి భవన్‌లోని పోలింగ్ బూత్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బ్యాలెట్ ద్వారా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటు వేశారు.


కీలక ఆప్ నేతలు..

ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ఆప్ అభ్యర్థి, ఢిల్లీ సీఎం అతిషి తన నివాసం నుంచి బయలుదేరి పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సెంట్రల్ ఢిల్లీలోని జంగ్‌పురా నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి మనీష్ సిసోడియా తన భార్యతో కలిసి లేడీ ఇర్విన్ స్కూల్‌లో పోలింగ్ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ ఓటు వేసిన తర్వాత, ఢిల్లీ ప్రజలు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.


కేంద్ర మంత్రులు కూడా..

దీంతోపాటు కేంద్ర మంత్రి హర్దీప్ పూరి, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, కాంగ్రెస్ అభ్యర్థి అల్కా లాంబా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలో ఈ ఎన్నికల్లో 1.5 కోట్లకు పైగా ఓటర్లు తమ తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఈరోజు ఓటు వేస్తున్నారు. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వరుసగా మూడోసారి పోటీ చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ (BJP) కాంగ్రెస్ పార్టీలు దేశ రాజధానిలో తిరిగి అధికారంలోకి రావాలని ఆశిస్తున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 13,766 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుగుతున్న ఎన్నికల్లో 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


భారీగా భద్రత..

ఎన్నికల కమిషన్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (QMS) యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఓటర్లు బూత్‌ల వద్ద రియల్ టైమ్ జనసమూహాన్ని తనిఖీ చేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రశాంతమైన ఓటింగ్‌ను నిర్ధారించడానికి దాదాపు 220 కంపెనీల పారామిలిటరీ దళాలు, 35,626 ఢిల్లీ పోలీసు సిబ్బంది, 19,000 మంది హోమ్ గార్డులను ఎన్నికల కమిషన్ నియమించింది. దాదాపు 3,000 పోలింగ్ బూత్‌లను సున్నితమైనవిగా గుర్తించారు. వీటిలో కొన్నింటిలో డ్రోన్ నిఘాతో సహా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలను కాపాడటానికి క్విక్ రియాక్షన్ టీమ్‌లను (QRTలు) కూడా మోహరించారు. సున్నితమైన బూత్‌ల కోసం అదనపు పోలీసు బలగాలను మోహరించనున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 8న జరగనుంది.


ఇవి కూడా చదవండి:

Delhi Assembly Elections 2025: ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా బూత్‌లకు బెలూన్లు ఏర్పాటు..

8th Pay Commission: ప్యూన్ నుంచి ఆఫీసర్ జీతాలు ఎలా పెరుగుతాయంటే.. నెలకు లక్షకుపైగా


Bank Holidays: ఫిబ్రవరి 2025లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులంటే.. పూర్తి జాబితా..

RBI Report: దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డులు ఎన్ని ఉన్నాయంటే.. వీటి వాడకంలో

IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 05 , 2025 | 10:28 AM