Home » Exit polls
ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.
ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆంధ్రప్రదేశ్‌లో జోష్ నింపాయి. రాష్ట్రంలో కూటమి గెలుస్తోందని బెట్టింగ్ రాయుళ్లు జోరుగా పందేలు కాస్తున్నారు. గతంలో కాసిన పందేనికి రూపాయికి రెండు రూపాయలు ఇస్తామని ముందుకొస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత కూటమి విజయంపై బెట్టింగ్ రాయుళ్ల ఆత్మవిశ్వాసం పెరిగింది.
లోకమంతా ఒకవైపు.. సీఎం జగన్ మరోవైపు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌లో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్, రైజ్ తదితర సంస్థలు పేర్కొన్నాయి. ప్రజల్లో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని స్పష్టం చేశాయి. ఊరూపేరూ లేని అనామక సంస్థలు వైసీపీయే అధికారంలోనికి వస్తుందంటూ ఇచ్చిన ఫలితాలను జగన్‌కు చెందిన చెందిన నీలి, కూలి మీడియాలో ప్రముఖంగా ప్రచారం చేసుకుని ప్రభుత్వ పెద్దలు సంతృప్తి చెందుతున్నారు. ఈ సంస్థలూ జగన్ చెప్పినట్లుగా 151 స్థానాలకు మించి వస్తాయని పేర్కొనలేదు
రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.
ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా!? కేంద్రంలో వరుసగా మూడోసారి కూడా బీజేపీయే తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి రాబోతోందా!? ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే
ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.
ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.
Lok Sabha Election 2024 Exit Poll Results Live Updates in Telugu: దేశాన్ని ఏలేది ఎవరు.. ప్రజలు పట్టం కట్టేదెవరికి.. పదేళ్లు ఏకఛత్రాదిపత్యంగా దేశాన్ని పాలించిన నరేంద్ర మోదీ(PM Narendra Modi) మరో అవకాశం ఇస్తారా? లేక మార్పు తప్పదు అంటూ ఇండియా కూటమికి(INDIA Alliance) జై కొడతారా? లేక ఎవరికీ మెజార్టీ రాకుండా చేస్తారా? ఇప్పుడిదే అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
ఎన్డీయే గెలుపొందే సీట్ల ఆధారంగా నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఈసారి బీజేపీ దూకుడు పెరగనుందని, బెంగాల్, ఒడిశాలో బీజేపీ గణనీయంగా ఎంపీ సీట్లు రాబట్టుకోనుందని, ఢిల్లీలోనూ బీజేపీ దాదాపు క్లీన్‌స్వీప్ చేసే అవకాశాలున్నాయని తేల్చాయి.
సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. మూడోసారి కూడా ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టారని..