Home » Fire Accident
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ కోల్ ప్లాంట్‌లో బుధవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా కన్వేయర్ బెల్ట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియాలోని హోటల్లో మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. లోపల ఉన్న వారంతా భయంతో పరుగులు తీశారు. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సుమారు 400 మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు..
విజయవాడలో రోడ్డుపై వెళ్తున్న అంబులెన్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇతర వాహనదారులు అప్రమత్తం చేయడంతో రహదారిపైనే అంబులెన్స్ ఆపేసి డ్రైవర్ దిగిపోయాడు.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని రాంరెడ్డి నగర్లో అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టుప్రక్కల స్థానికులు భయాందోళనలతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ATM Robbery: హైదరాబాద్‌లో వరుస ఏటీఏం చోరీల ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. మైలార్ దేవ్ పల్లిలోని ఏటీఏంలో దుండగులు చోరీకి యత్నించారు. అయితే అదే సమయంలో ఏటీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోని దుకాణంలో షాట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటలకు అక్కడ పార్క్ చేసిన రెండు కార్లు తగులబడ్డాయి. ఆ రెండింటిలో ఒక వాహనంలోని గ్యాస్ సిలిండర్ పేలింది.
కృష్ణా జిల్లా: గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్తుండగా ఆశ్రమంలోని ఓ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Huge Fire Accident: తెలంగాణలోని జనగామ జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. ప్రమాదం జరగడంతో పరిశ్రమలోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎగిసిపడుతున్న అగ్నికీలలను ఆర్పేందుకు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Fire Accident: విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సితార గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది.
పాతబస్తీ దివాన్‌దేవిడిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 30 కి పైగా బట్టల షాపులకు మంటలు అంటుకున్నాయి. 20 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి.