Home » Gannavaram
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ (Minister TG Bharath ) అన్నారు. ఏపీలో పారిశ్రామికవేత్తలు ఆందోళనలో ఉన్నారని, వైసీపీ పాలనలో వారిని పట్టించుకున్న నాథుడే లేడని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
గన్నవరం నియోజకవర్గం, ఉంగుటూరు మండల టీడీపీ మహిళా అధ్యక్షురాలిగా మండవ రమ్యకృష్ణ ఉన్నారు. ఆమె షిర్డీ నుంచి గన్నవరం వస్తున్న రమ్యకృష్ణ రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. రమ్యకృష్ణ మృతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. రమ్యకృష్ణ మృతి బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లోనే ఆరంభం కానున్న ప్రమాణ స్వీకార వేడుక కోసం కృష్ణాజిల్లా గన్నవరంలోని కేసరపల్లి గ్రామం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇరవై ఎకరాల ప్రాంగణంలో మూడు ...
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ.. పలువురు ప్రముఖులకు ఆహ్వానాలందాయి.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్(Singapore Consulate), కొరియా కాన్సులేట్ (Koria Consulate) జనరల్స్, ఇతర ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ (PM Modi), ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
అమరావతి: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు 60 అడుగుల పొడవు ఎనిమిది అడుగుల ఎత్తుతూ స్టేజి సిద్ధం చేశారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. జూన్-12న ఉదయం 11:27 గంటలకు ఏపీ సీఎంగా ప్రమాణం చేయబోతున్నారు...