Home » Harish Rao
Telangana: మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై కేసీఆర్, హరీష్ రావులకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. భూపాలపల్లి కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేసీఆర్, హరీష్‌రావులు హైకోర్టును ఆశ్రయించారు. కేసీఆర్, హరీష్‌రావు వేసిన పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టు విచారణ జరిపింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా కోర్టులో ఉన్న కేసును కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు హైకోర్టులో సోమవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.
రాష్ట్ర ప్రజల సమస్యల కంటే అల్లు అర్జున్ విషయం ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు.
సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చారని, అబద్ధాల పాలనే చేస్తున్నారని మాజీమంత్రి హరీశ్‌రావు విమర్శించారు.
ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి పెట్టించింది డొల్ల కేసు అనే విషయం హైకోర్టు ఉత్తర్వులతో తేటతెల్లమైందని.. మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
ఫార్ములా ఈ కారు రేసు వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. ఈ అంశంపై సభలో చర్చించాల్సిందేనని పట్టుబట్టిన బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్‌పై కాగితాలు విసిరారు. దీనికి ప్రతిగా వారిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్ కాగితాలు విసిరారు.
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మరోసారి వాడీవేడి సంభాషణ జరిగింది. గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశ్న అడిగారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.