Home » Harish Rao
Telangana: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు (మంగళవారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఉద్దేశిస్తూ ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ మంత్రి హరీష్‌రావు. హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్ గాంధీ.. అశోక్‌నగర్ వెళ్లాలని.. అక్కడి నిరుద్యోగ యువతను కలవాలని.. ఆ యువత పట్ల ప్రభుత్వం ఎలా ప్రవర్తించిందో చూడాలంటూ సోషల్ మీడియా ఎక్స్‌లో మాజీ మంత్రి పోస్టు చేశారు.
వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నది తామేనని చెబుతూ కాంగ్రెస్.. దేశాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, ఈ వైఖరి మంచిది కాదని.. మాజీమంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
దొంగలు, టెర్రరిస్టులను అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచ్‌లను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు.
Telangana: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ సర్పంచ్‌లకు మద్దతుగా తిరుమలగిరి రోడ్డుపై మాజీ మంత్రితో పాటు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని హరీష్‌తో పాటు గులాబీ పార్టీ నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
Telangana: ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచ్‌లను అరెస్టులు చేయడమేనా అని హరీష్‌రావు ప్రశ్నించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచ్‌లకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచ్‌లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ సర్పంచ్‌లు అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని హరీష్‌రావు మండిపడ్డారు. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా.. అని ప్రశ్నించారు.
రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగ గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ ఆదివారం సందర్శించారు.
రైతుల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మండిపడ్డారు. ఆదివారం సిద్దిపేటలో హరీశ్ రావు మాట్లాడుతూ.. రైతులు వద్ద వడ్ల కొనుగోలు చేసే సమయం అసన్నమైనా.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రైతుల తీవ్రంగా నష్ట పోతున్నాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలతోపాటు దేశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంటే.. కొత్త సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రకు సిద్ధమని కేటీఆర్ మనసులో మాటను బయటపెట్టారు. మరోవైపు తెలంగాణలో బాంబులు పేలతాయంటూ మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. మరోవైపు హైదరాబాద్ నుంచి వాడపల్లికి..