Home » Harish Rao
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు వ్యవహారం తెలంగాణలో పెద్దఎత్తున రాజకీయ దుమారం లేపుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసు విషయమై హైకోర్టును ఆశ్రయించారు. ఇవాళ(శుక్రవారం) విచారణ చేపట్టిన ధర్మాసనం వారం రోజులపాటు కేటీఆర్‌ను అరెస్టు చేయవద్దంటూ తీర్పు చెప్పింది.
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. భూ భారతి బిల్లుపై చర్చను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు.
అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మరోసారి వాడీవేడి సంభాషణ జరిగింది. గురువారం సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వెంకట్‌రెడ్డి ప్రశ్న అడిగారు.
రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై శాసనసభలో అధికార, విపక్షాల మధ్య తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందని అధికారం పక్షం.. ఏడాదిలోనే కాంగ్రెస్ పార్టీ రూ.1.27 లక్షల కోట్లు అప్పు చేసిందని బీఆర్ఎస్ దుమ్మెత్తిపోసుకున్నాయి.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డికి నిజంగా గౌతమ్ అదానీపైన పోరాటం చేయాలనుంటే.. దావో్‌సలో ఆయనతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో గురుకులాలు, పాఠశాలల్లో మౌలిక వసతులపై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది.
Telangana Assembly 2024 Live Updates in Telugu: తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ప్రారంభమవడమే ఆలస్యం.. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
భూములివ్వబోమని చెప్పిన దళిత, బలహీనవర్గాల రైతులను రేవంత్ సర్కారు జైల్లో పెట్టిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమానికి, కేసీఆర్‌కు గద్దర్ అండగా నిలబడ్డారని మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. ఐదు దశాబ్దాల కాలంలో జరిగిన ప్రతి పోరాటంలో గద్దర్ తన వంతు పాత్ర పోషించి పోరాటయోధుడిగా, తన పాటలతో ఉద్యమాలకు ఊపు అందించిన వీరుడిగా నిలిచారని మెచ్చుకున్నారు.