Home » Heavy Rains
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 14, 15, 16 తేదీల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతంలో ఉపరితర ఆవర్తనాలు ఏర్పాడ్డాయని విపత్తు నిర్వహాణ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. ఈ నేపథ్యంలో రానున్న నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ స్పందించారు. ఈ అల్పపీడన ప్రభావంతో సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందన్నారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనుండగా, అదే సమయంలో రాష్ట్రంలో శుక్రవారం నుంచి భారీ స్థాయిలో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, నగరంలో, సబర్బన్ ప్రాంతాల్లో బుధవారం అర్ధరాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది.
దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాల వేళ వరణుడు పలుచోట్ల ఆటంకం కలిగించాడు. అంతేకాదు వచ్చే రెండు, మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది. అయితే ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా కూల్‌గా మారింది. ఓ వైపు సద్దుల బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటుతుండగా.. వేడితో అల్లాడుతున్న హైదరాబాద్‌వాసులకు వాన జల్లులు పలకరించాయి.
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు రూ.79.57కోట్ల పరిహారాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో గత నెలలో భారీ వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో భారీ వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధానంగా విజయవాడలోని బుడమేరు ఉధృతంగా పొంగి ప్రవహించింది. దీంతో లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలం అయిందని సీపీఎం సీనియర్ నేత సీ హెచ్ బాబూరావు ఆరోపించారు, వరదల వల్ల రాష్ట్రంలో పదకొండున్నర లక్షల మంది ఇబ్బందులు పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.