Home » Kadiyam Srihari
కడియం శ్రీహరి దళిత దొర అని వరంగల్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. దళితులను తొక్కి ఎదిగిన వ్యక్తి కడియం శ్రీహరి అని మండిపడ్డారు. కడియం శ్రీహరి మేకవన్నే పులి అని తీవ్ర ఆరోపణలు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచి.. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని వారిని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వారిపై అనర్హత పిటిషన్‌ను ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పీకర్ కార్యాలయానికి అందజేశారు.
వరంగల్: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదని.. జాతీయ పార్టీతోనే సాధ్యమని.. అందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని, అలాగే తన నియోజకవర్గం అభివృద్ధి కోసమే పార్టీ మారానని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. గత పదేళ్లుగా కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటిని నాశనం చేస్తోందని విమర్శించారు.
ఎంపీ కేశవరావుకు మతి భ్రమించినట్లుందని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. మిలియన్ మార్చ్‌లో కేశవరావును కొడిగుడ్లతో కొట్టిన ఘటనలను గుర్తు చేసుకోవాలి. ఇవాళ పాట లేదు మాట లేదని కేశవరావు మాట్లాడుతున్నారని.. ఆయన భాష ఎవరికి అర్ధం కాదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిలువరించిన నాలుగు స్థానాలు కాకరేపుతున్నాయి. మాకు కావల్సిందంటే.. మాకు కావాల్సిందేనంటూ బడా నేతలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు సీన్లోకి ఎంటర్ అవుతున్నారు. నేడు తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్ కసరత్తు నిర్వహిస్తోంది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో బీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య కాంగ్రెస్‌లో చేరారు. వారికి దీపాదాస్ మున్షీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వరంగల్: తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరఫున పోటీ చేయించదలచుకోలేదని స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ మారే విషయంపై ఆలోచిస్తున్నది అందుకేనన్నారు. వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందని
బీఆర్ఎస్ (BRS) నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లిన దానం నాగేందర్‌పై అసెంబ్లీ స్పీకర్ అనర్హతా వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) కోరారు. శనివారం నాడు తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మార్చ్ 18వ తేదీన సభాపతిని కలిసి దానం నాగేందర్‌పై అనర్హత పిటిషన్ వేసినట్లు తెలిపారు.
బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అవకాశాలు పొందిన వారే పార్టీలు మారుతోన్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను సంజీవని ఇచ్చి పార్టీ అధినేత కేసీఆర్ బతికించారని ఆయన పేర్కొన్నారు.