Home » Kadiyam Srihari
బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వెళ్లడంపై స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక ప్రకటన చేశారు. స్టేషన్ ఘన్పూర్ కార్యకర్తలతో కడియం శ్రీహరి శనివారం నాడు సమావేశం అయ్యారు.
బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి, అవకాశాలు పొందిన వారే పార్టీలు మారుతోన్నారని బీఆర్ఎస్ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల్లో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లను సంజీవని ఇచ్చి పార్టీ అధినేత కేసీఆర్ బతికించారని ఆయన పేర్కొన్నారు.
బీఆర్ఎస్కి చెందిన కీలక నేతలు కొందరు ఇవాళ కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. ఆపరేషన్ ఆకర్ష్‌తో బీఆర్ఎస్ నేతలు భారీగా కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ రోజు ఎంపీ కేకే, ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చేరనున్నారు. అలాగే స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య, ఉమ్మడి అదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత పురాణం సతీష్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు.
పార్టీలోని చెత్త అంతా పోయిందని.. గట్టి వాళ్లు మాత్రమే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
నేడు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.
..పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్(BRS)కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలందరూ వరుసగా కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో చేరుతున్న విషయం తెలిసిందే. ఇదేకోవలో వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య(Kadiyam Kavya) కూడా బీఆర్ఎస్కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. వరంగల్ పార్లమెంట్ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు కడియం కావ్య స్పష్టం చేశారు. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు ఈ విషయంపై కావ్య లేఖ రాశారు.
తెలంగాణకు రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిని అందించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు వరస చిక్కుల్లో ఇరుక్కుంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది.
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...30 ఏళ్ల నాటి కాంగ్రెస్ కిరాతక చర్యలు.. రెండు నెలల్లోపే పురుడు పోసుకున్నాయని మండిపడ్డారు.
Telangana: అసెంబ్లీలో సీఎం రేవంత్ అనుచిత భాషను ఖండిస్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారని.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సెషన్ చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. శాసన సభ్యులు కడియం శ్రీహరి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరికొకరు తీవ్రంగా విమర్శించుకున్నారు.