Share News

గోదావరిని కాలుష్య రహితంగా మారుద్దాం

ABN , Publish Date - Apr 12 , 2025 | 12:41 AM

గోదావరిని కాలుష్య రహితంగా మార్చడం ద్వారా ప్రజలకు పవిత్ర జలాలను అందిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అమృత్‌ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు.

గోదావరిని కాలుష్య రహితంగా మారుద్దాం

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): గోదావరిని కాలుష్య రహితంగా మార్చడం ద్వారా ప్రజలకు పవిత్ర జలాలను అందిద్దామని రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ప్రజారోగ్యశాఖ, మున్సిపల్‌ కార్పొరేషన్‌, అమృత్‌ పనులు నిర్వహిస్తున్న ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారు. రామగుండం కార్పొరేషన్‌ పరిధిలో రూ.88కోట్ల అమృత్‌ నిధులతో రామగుండం, మల్కాపురం, యైుటింక్లయిన్‌కాలనీ, జనగామలలో సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్ల నిర్మాణం జరుగాల్సి ఉందని, ఇప్పటికే రామగుండం, మల్కాపూర్‌, యైుటింక్లయిన్‌ కాలనీల్లో పనులు ప్రారంభమయ్యాయని ఎమ్మెల్యే తెలిపారు. పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని, పది నెలల్లో అందుబాటులోకి రావాలన్నారు. ప్రధాన నాలాల మురుగునీరు నేరుగా గోదావరిలో కలువ కుండా శుద్ధి చేసిన తరువాతే కలిసేలా చర్యలు చేపట్టాలన్నారు. జనగామ ఎస్‌టీపీకి సంబంధించి లొకేషన్‌ను మార్చాలని, కొంత ముందుకు మార్చితే ప్రయోజనకరంగా ఉందన్నారు. ఎస్‌టీపీ టెండర్లు పూర్తయి పనులు మొదలవడంతో ఇప్పటికే జాప్యం జరిగిందని, ఎందుకు జాప్యం చేస్తున్నారంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రాయింగ్‌ అప్రువల్‌ కాక ఆలస్యమైందని, పనులు త్వరిగతగిన పూర్తి చేస్తామన్నారు. ప్యాకేజీ పనులు సమాంతరంగా జరుగాలని, స్ర్టోమ్‌ వాటర్‌ డ్రైన్లు, డైవర్షన్లు, ట్రీట్‌మెంట్‌ ప్లాంటు పనులు త్వరితగతిన పూర్తి కావాల న్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ఎస్‌బీఆర్‌ టెక్నాలజీతో నిర్మించే ఈ ప్లాంట్లు పూర్తయితే కాలుష్య వాతావరణం ఉం డదన్నారు. ఇప్పటికే నగరంలో ప్రధాన నాలాలను ఆధునీకరి స్తున్నారని, ఎక్కడా కచ్చ నాలాలు ఉండవన్నారు. ఎస్‌టీపీల నిర్మాణం పూర్తయితే నాలాల్లో వ్యర్థాలు కలువకుండా ప్రణా ళికలు రూపొందిస్తామన్నారు. కార్పొరేషన్‌ ఈఈ రామన్‌, ప్రజారోగ్యశాఖ డీఈ దేవేందర్‌రెడ్డి, ఏఈలు మౌనిక, మనోజ్‌, యశోద ఏజెన్సీ ప్రతినిధి ప్రభు, పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 12:41 AM