Home » Karimnagar
విద్యా , వైద్యం , టూరిజం, పరిశ్రమలు, వ్యవసాయం, ఉపాధి కల్పన అన్నింటిపై దృష్టి సరించామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జీవో 190 ద్వారా నాలుగు గురుకులాలు ఒకే కాంప్లెక్స్‌గా విద్యను అంతర్జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ఏర్పాటు చేశామన్నారు. నాలుగవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడే చదువుకునేల భవనాల నిర్మాణం జరుగుతుందన్నారు.
కాసులకు కక్కుర్తి పడి జిల్లా లోని కొందరు వైద్యులు యథేచ్ఛగా లింగ నిర్దారణ పరీక్షలు చేస్తున్నారు. గర్భంలో ఉన్నది ఆడ, మగ అని నిర్ధారిస్తూ...ఆడ శిశువు అయితే పురిట్లోనే కడతేరుస్తున్నారు. తాజాగా జిల్లాలోని అశోక్ నగర్లో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో..
కరీంనగర్లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్ఎస్ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
అయ్యప్ప సొసైటీలో అక్రమాల కూల్చివేత పేరుతో హడావుడి చేసిన బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడితే.. హైడ్రా కూల్చివేతల పేరుతో కాంగ్రెస్ పాలకులు సంపన్నుల నుంచి వసూళ్లు చేసే తంతుకు తెరదీశారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
రాష్ట్రంలోని మహిళా సమాఖ్యలచే బస్సులను కొనుగోలు చేయించి అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి నడిపించనున్నామని, ఆ మేరకు మెప్మాతో సంప్రదింపులు జరుపుతున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
త్వరలో టీజీఎస్ ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అందుకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు. సంస్థలో మిగిలిన ఖాళీలను సైతం భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
Telangana: ఈనెల 22న ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయపడిన శివప్రసాద్‌ను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందంటూ వైద్యలు తెలిపారు. అయితే ఎస్సై కొట్టడం వల్లే సదరు వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డంటూ బాధితుడి సోదరి సోషల్ మీడియాలో వీడియోను విడుదల చేసింది.
ఓవైసీ బ్రదర్స్‌కు(Owaisi Brothers) ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని కేంద్ర సహాయ శాఖ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓల్డ్ సిటీ ఓవైసీ కనుసన్నల్లో ఉగ్రవాదుల అడ్డాగా మారిందని ఆరోపించారు.
ఇలా ఒకటీ, రెండూ కాదు... రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వాహనాలను పెట్రోల్, డీజిల్ కొరత పట్టి పీడిస్తోంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నా... జిల్లాల్లో నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
కరీంనగర్ జిల్లా: తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని, ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయని, సీపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారని.. తమ ఫోన్ ట్యాప్ చేయరని గ్యారంటీ ఏమిటని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన కరీంనగర్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ..