Home » Kesineni Nani
ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్చార్జి బుద్దా వెంకన్న ఆసక్తికర ట్వీట్ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఒక కోవర్ట్ అంటూ విమర్శలు గుప్పించారు.
Andhrapradesh: ‘‘నా సమర్ధత గురించి ఎంపీ కేశినేని నాని మాట్లాడటం హాస్యాస్పదం’’ అని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో మెజారిటీ పెంచుకున్న తాను సమర్థుడినో, ఓట్ల శాతం తగ్గిన కేశినేని నాని సమర్థుడో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
విజయవాడ ఎంపీ కేశినేని నానిపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచి వైసీపీ కోవర్టుగా పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. 2017లో టీడీపీలో చేరేందుకు దేవినేని అవినాష్ ప్రయత్నించారని వెంకన్న తెలిపారు. టీడీపీలో చేరొద్దని కేశినేని నాని చెప్పారని తర్వాత తెలిసిందని తెలిపారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu ) తనకు ఏ బాధ్యత ఇచ్చిన దానికి కట్టుబడి.. ఆ బాధ్యతను నెరవేర్చుతానని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని ( Keshineni Chinni ) తెలిపారు.
రెండేళ్ల నుంచే టీడీపీని వీడాలన్న ఆలోచనల్లో మాజీ ఎంపీ కేశినేని నానీ ఉన్నాడని తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి శావల దేవదత్ ( Devadat ) అన్నారు.
మాజీ ఎంపీ కేశినేని నాని ( Keshineni Nani ) అవకాశవాది.. సీఎం జగన్ ( CM Jagan ) అరాచక వాది అని టీడీపీ సీనియర్ నేత నెట్టెం రఘురాం ( Nettem Raghuram ) ఎద్దేవా చేశారు. గురువారం నాడు టీడీపీ కార్యాలయంలో నెట్టెం రఘురాం మీడియాతో మాట్లాడుతూ... ఓ అండర్ స్టాండింగుతోనే కేశినేని నాని జగన్ వద్దకు చేరారని నెట్టెం రఘురాం చెప్పారు.
ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై ఆయన సోదరుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కేశినేని శివనాథ్ (చిన్ని) స్పందించారు. తమ కుటుంబ కలహాలనేవి 1999 నుంచి ఉన్నాయని.. వాటితో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏం సంబంధమని ప్రశ్నించారు. నాని తనను ఎన్ని అన్నా 99 నుంచి తానే సర్దుకుపోతున్నానన్నారు.
ఎంపీ కేశినేని నానిపై వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బోరుకొచ్చిన బండి షెడ్డు మారిందంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. నాని బుద్ది గురించి బెజవాడంతా తెలుసని పేర్కొన్నారు.
ఎంపీ కేశినేని నానిపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఫైర్ అయ్యారు. నానిది ఫ్యూడల్ మనస్తత్వమన్నారు. దళిత, బలహీన వర్గాల నాయకులతో కనీసం మాట్లాడటానికి కూడా ఇష్టపడరన్నారు. తిరువూరు టీడీపీ ఇన్చార్జ్ శావల దత్తును బండ బూతులు తిడుతూ, ఆయనపై దాడికి యత్నించిన మాట వాస్తవం కాదా?
తెలుగుదేశం పార్టీకి కేశినేని నాని గుడ్‌బై చెప్పేశారు. బుధవారం టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన ఆయన.. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబుకి పంపించారు. ఈ సందర్భంగా..