Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని హార్ట్ ఆపరేషన్.. బిగ్ అప్‌డేట్
ABN , Publish Date - Apr 02 , 2025 | 05:59 PM
Kodali Nani Heart Surgery Success: మాజీ మంత్రి కొడాలి నాని ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో గుండె సంబంధిత సర్జరీ చేయించుకున్నారు. వైద్యులు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన్ని పర్యవేక్షిస్తున్నారు.

ముంబై: మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నాని గత కొద్దిరోజుల నుంచి గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన గుండె ఆపరేషన్ చేయించుకోవడానికి ముంబైకి వెళ్లారు. ముంబైలోని ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో చేరారు. అక్కడి వైద్యులు తాజాగా కొడాలి నానికి బైపాస్ సర్జరీ చేశారు. సర్జరీ విజయవంతం అయింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ టు ముంబై
కొద్దిరోజుల క్రితం కొడాలి నాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆయన్ను పరీక్షించిన వైద్యులు గుండెకు సంబంధించిన సమస్య వచ్చినట్లు గుర్తించారు. ఆయన గుండెల్లో మూడు వాల్వ్స్ పూడుకు పోయినట్లు తెలుస్తోంది. గత ఐదు రోజుల నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. తాజాగా, కొడాలి నానిని హైదరాబాద్ నుంచి ముంబై తీసుకెళ్లారు. ప్రత్యేక విమానంలో ముగ్గురు డాక్టర్ల పర్యవేక్షణలో ముంబై తీసుకెళ్లారు.
అక్కడి ఏషియన్ హార్ట్ కేర్ సెంటర్‌లో సర్జరీ జరిగింది. అయితే, ఆయనకు గుండె సంబంధిత సమస్యలతో పాటు మరికొన్ని వ్యాధులు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా, 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే. అధికారంలో ఉన్నపుడు చాలా యాక్టీవ్‌గా ఉన్న నాని.. ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయారు. అసలు మీడియా ముందుకు రావటమే మానేశారు. కామెంట్లు చేయటం కూడా ఆపేశారు. ఎవరైనా అడిగితే.. ఓడిపోయిన తర్వాత ఎందుకు యాక్టీవ్‌గా ఉండాలి అని సమాధానం ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..