Home » Loans
ప్రస్తుత పరిస్థితుల్లో దాదాపు అనేక మంది ఉద్యోగులు(employees) క్రెడిట్ కార్డులను(credit cards) ఉపయోగిస్తున్నారు. ఈ కార్డులను ప్రతి నెల అనేక మంది ఖర్చుల చెల్లింపుల కోసం వినియోగిస్తారు. ఇక మంత్ ఎండ్ వచ్చే సరికి వాటి బిల్లుల(bills) చెల్లింపు తేదీ అలర్ట్లు వచ్చేస్తుంటాయి. ఈ నేపథ్యంలో అసలు గడువు తేదీలోపు బిల్లులు(bills) చెల్లింపు చేయకుంటే ఏమవుతుంది. అలా చేయడం సరైనదేనా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ప్రస్తుత రోజుల్లో సిబిల్ క్రెడిట్ స్కోర్(CIBIL Score) పాత్ర చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే మీకు లోన్(loan) అవసరమైనప్పుడల్లా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ముందుగా మీ క్రెడిట్ స్కోర్ను తనిఖీ చేస్తాయి. మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంతకంటే తక్కువ ఉంటే మీ లోన్ దరఖాస్తులు దాదాపు తిరస్కరించబడతాయి. చాలా సందర్భాలలో చేసిన చిన్న చిన్న తప్పుల(mistakes) కారణంగా ఇది క్షీణిస్తుంది. ఆ తప్పులు ఏంటో ఇప్పుడు చుద్దాం.
పర్సనల్ లోన్స్(personal loans) వీటిని అనేక మంది ఉద్యోగులు ఎక్కువగా తీసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సాధారణంగా లోన్స్ అవసరమైనప్పుడు మొదట బ్యాంకు వైపు చూస్తారు. ఎందుకంటే బ్యాంకులు తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో రుణం ఇస్తాయి. కానీ ఈ రుణాలు ఎక్కువగా తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దని విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు మొదటిసారిగా హోమ్ లోన్(home loan) తీసుకోవాలని ఆలోచిస్తున్నారా. అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే గృహ రుణం విషయంలో వడ్డీ రేటు(interest rates) కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం ఏఏ బ్యాంకుల్లో(banks) వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తప్పనిసరిగా పరిశీలించాలి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తున్నాయో ఇక్కడ చుద్దాం.
మధ్య తరగతి ఉద్యోగులకు(employees) అత్యవసరంగా డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో మనీ కోసం తెలిసిన వారిని సంప్రదిస్తారు. ఆ సమయంలో వారి దగ్గరి నుంచి కూడా డబ్బు సాయం దొరకదు. దీంతో రుణం(loan) తీసుకోవాలని భావిస్తారు. కొంచెం వడ్డీ అటు ఇటుగా ఉన్నా కూడా ఆలోచించకుండా పర్సనల్ లోన్(personal loans) తీసుకుంటారు. అయితే తీసుకున్న రుణం కట్టకుంటే(not paid) ఎలా, ఆ సంస్థలు లేదా బ్యాంకులు ఎలాంటి చర్యలు తీసుకుంటాయనేది ఇప్పుడు చుద్దాం.
తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతా.. మహిళలు ఆర్థికంగా ఎదిగేలా ప్రోత్సహిస్తా.. ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతా.. అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా..! ఇవీ 2019 ఎన్నికల ముందు వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి (Jagan) చెప్పిన మాటలు. ఐదేళ్ల వైసీపీ పాలన తర్వాత చూస్తే.. అప్పుల కుప్పలు.. అరాచకాలు.. గుంతల రోడ్లు, మహిళలపై పెరిగిన వేధింపులు, పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడు. ఎన్నికల వేళ ఏపీలో జరుగుతున్న ప్రధాన చర్చ ఇదే.
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..
Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ప్రజల తమకంటూ ఓ ఇల్లు, సొంత వాహనం ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఇందులో భాగంగానే.. తమ వద్ద డబ్బుతో పాటు.. కొంత మొత్తంలో లోన్ తీసుకుని మరీ ఇళ్లు కట్టుకోవడం, సొంతంగా వాహనం కొనుగోలు చేయడం చేస్తున్నారు. మంచి శాలరీ వచ్చే వారికి లోన్ చాలా ఈజీగా లభిస్తుంది. అయితే, లోన్ పొందడం అందరికీ సులువు కాదనేది కూడా నిజం.