Share News

RBI: హోం లోన్ బకాయిలు పెరుగుతున్నాయ్.. ఏ విభాగంలో ఎంతంటే..?

ABN , Publish Date - Jun 29 , 2024 | 03:43 PM

దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి హోం లోన్(Home Loans) తీసుకున్న వారు తిరిగి సకాలంలో కట్టట్లేదని ఆర్బీఐ(RBI) నివేదికలో వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పర్సనల్ లోన్ సెగ్మెంట్ డేటాను విడుదల చేసింది.

RBI: హోం లోన్ బకాయిలు పెరుగుతున్నాయ్.. ఏ విభాగంలో ఎంతంటే..?

ఇంటర్నెట్ డెస్క్: దేశ వ్యాప్తంగా వివిధ బ్యాంకుల నుంచి హోం లోన్(Home Loans) తీసుకున్న వారు తిరిగి సకాలంలో కట్టట్లేదని ఆర్బీఐ(RBI) నివేదికలో వెల్లడైంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే పర్సనల్ లోన్ సెగ్మెంట్ డేటాను విడుదల చేసింది. మే 2024లో హౌసింగ్ లోన్ బకాయిలు సంవత్సర ప్రాతిపదికన వేగంగా వృద్ధి చెందాయని డేటా సూచిస్తోంది. వ్యక్తిగత రుణ విభాగంలో అతిపెద్ద భాగం అయిన హౌసింగ్ క్రెడిట్ వృద్ధి 16.9 శాతం (రూ. 3.40 లక్షల కోట్లు) పెరిగి రూ. 23.49 లక్షల కోట్లకు చేరుకుంది.

గతేడాది ఈ వృద్ధి 13.8 శాతంగా ఉంది. అదే సమయంలో 2024 మేలో మొత్తం వ్యక్తిగత రుణాల వృద్ధి సంవత్సరానికి 17.8 శాతానికి తగ్గింది. ఇది ఏడాది క్రితం 19.1 శాతంగా ఉంది. RBI డేటా ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బకాయిలు 2024 మే లో 26.2 శాతం (రూ. 55 వేల కోట్లు) పెరిగి రూ. 2.67 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది రూ. 2.12 లక్షల కోట్ల వద్ద 31.5 శాతం వృద్ధి చెందాయి. అంతేకాకుండా, ఆహారేతర బ్యాంకు క్రెడిట్ ద్వారా ఈ ఏడాది మేలో 16.2 శాతం వృద్ధితో రూ.162.30 లక్షల కోట్లకు చేరుకుంది.


పరిశ్రమలకు...

పరిశ్రమలకు ఇచ్చే బ్యాంకు రుణం గత ఏడాది మేలో 6 శాతంతో పోలిస్తే 8.9 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.36.87 లక్షల కోట్లకు చేరుకుంది. పెద్ద పరిశ్రమలకు ఇచ్చే బకాయిలు 7.1 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 26.53 లక్షల కోట్లకు చేరుకోగా, మధ్యతరహా పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు ఒక్కొక్కటి 15.5 శాతం వృద్ధితో వరుసగా రూ. 3.13 లక్షల కోట్ల, 7.36 లక్షల కోట్లకు చేరుకున్నాయి.


వ్యవసాయం, సేవా రంగం..

వీటితో పాటు, వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు రుణ వృద్ధి 21.6 శాతానికి (yoy) పెరిగింది. గతేడాది కేవలం 16.0 శాతంగా నమోదైంది. 2024 మే నాటికి రూ. 21.39 లక్షల కోట్లకు చేరుకుంది.అంతేకాకుండా సేవా రంగ రుణ వృద్ధి 2024 మేలో 21.3 శాతంగా ఉందని ఉందని ఆర్బీఐ డేటా వెల్లడించింది.

For Latest News and National News click here..

Updated Date - Jun 29 , 2024 | 03:47 PM