ప్రియాంక నామినేషన్‌కు ఆమోదమెలా?: బీజేపీ
ABN , Publish Date - Oct 29 , 2024 | 03:59 AM
వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవియా మండిపడ్డారు.
న్యూఢిల్లీ, అక్టోబరు 28: వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా నామినేషన్‌ను ఈసీ ఆమోదించడం పట్ల బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జి అమిత్ మాలవియా మండిపడ్డారు. ప్రియాంక... తనతో పాటు తన భర్త రాబర్ట్‌వాద్రాకు సంబంధించిన ఆస్తి వివరాలను పూర్తిగా బహిర్గతం చెయ్యలేదని ఆరోపించారు. ‘‘అఫిడవిట్‌లో ప్రియాంకా పాక్షిక వివరాలే పొందుపరిచారు. అసొసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడిచే ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికలో పెట్టుబడుల గురించి వెల్లడించకపోగా, ఎఫ్‌ఐఆర్‌ను కూడ ఆమె జతచేయలేదు. అయినా నామినేషన్‌ను కలెక్టర్ అంగీకరించారంటే... ఎన్నికలను నిర్వహిస్తోంది ఈసీనా? లేక కలెక్టరా?’’ అని మాలవియా ట్వీట్‌లో ప్రశ్నించారు. కాగా, తనకు రూ. 12 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు ప్రియాంక గాంధీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొనారు. అఫిడవిట్ ప్రకారం రాబర్ట్ వాద్రా స్థిర,చరాస్తుల విలువ సుమారు రూ. 66 కోట్లు.