Home » Madhya Pradesh
కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరుతారనే ఊహాగానాలకు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ తెరదించారు. ''నా నోటి నుంచి ఎప్పుడైనా ఆ మాట రావడం మీరు విన్నారా? అలాంటి సంకేతాలు ఏవైనా ఉన్నాయా? అలాంటిదేమీ లేదు. మీరే పార్టీ మారుతున్నానంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వచ్చి నన్ను అడుగుతున్నారు. మీరే ఆ మాటల్ని ఖండించండి'' అని మీడియాతో మాట్లాడుతూ కమల్‌నాథ్ అన్నారు.
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ మన నేత, ఆయన చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనాలని కోరారు. కమల్ నాథ్ బీజేపీలో చేరతారని ఇటీవల ఊహాగానాలు వచ్చిన సంగతి తెలిసిందే.
గురువారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు బస్సు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 16 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ఈ ఆధునిక యుగంలో.. ప్రేమలో సక్సెస్ స్టోరీలకన్నా ఫెయిల్యూర్ కథలే ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. అందునా.. చీటింగ్ కేసుల సంఖ్య గణనీయంగా ఉంది. ప్రేమ పేరుతో వంచించి, తమ కోరిక తీరిన వెంటనే పార్ట్నర్స్ని వదిలేస్తున్న ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇండోర్‌లోనూ ఇలాంటి ఘటనే ఒకటి తెరమీదకి వచ్చింది. ప్రేమించిన వ్యక్తి కోసం లింగమార్పిడి చేయించుకోగా.. అతడు దారుణంగా మోసం చేశాడు.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మంత్రి ఎల్.మురుగున్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి ఒక అభ్యర్థి పోటీకి దిగారు. రాష్ట్రం నుంచి మొత్తం ఐదు రాజ్యసభ స్థానాలకు ఐదుగురే పోటీ చేయడంతో వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
రెండ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు, పార్లమెంటు సభ్యుడు నకుల్ నాథ్ బీజేపీ తీర్థం తీసుకోనుండటం దాదాపు ఖాయమైంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ సమక్షంలో వీరిరువురూ కమలం పార్టీలో సోమవారంనాడు చేరనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
ఓ పెళ్లికి అనుకోని అతిథులుగా ఎంట్రీ ఇచ్చిన తేనెటీగలు అల్లకల్లోలం సృష్టించడంతో 12 మంది గాయాలపాలయ్యారు. మధ్యప్రదేశ్‌లో ఈ దారుణం వెలుగు చూసింది.
సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం తప్పేలా లేదు. సీనియర్ అయిన తనకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని సన్నిహితుల వద్ద కమల్ నాథ్ వాపోయారని తెలుస్తోంది. రాజ్యసభ సీటు ఇవ్వాలని పెద్దలను కోరితే స్పందించలేదని, అందుకే గుర్రుగా ఉన్నారని వారు చెబుతున్నారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరనున్నారంటూ ఊహాగానాలు వెలువడటం, ఇందుకు తగ్గట్టుగా ఆయన తన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్‌తో శనివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోవడంతో హస్తినలో ఎంపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇదే విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు కమల్‌నాథ్ సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. ''అలాంటిదేమైనా ఉంటే ముందే మీకు చెబుతాను'' అని వ్యాఖ్యానించారు.
మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌కు గట్టి దెబ్బ తగిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'లో భాగంగా రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లో శనివారం అడుగుపెట్టగా, కాంగ్రెస్ మాజీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, ఆయన కుమారుడు, ఛింద్వారా ఎంపీ నకుల్ నాథ్ అనూహ్యంగా ఢిల్లీకి బయలుదేరారు. దీంతో వీరిద్దరూ బీజేపీలో చేరనున్నారనే ఊహాగానాలు మరింత బలపడ్డాయి.