PM Modi: సభ మధ్యలో తల్లి ఫోటో చూసి మోదీ భావోద్వేగం
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:39 PM
దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ఎన్నికల ర్యాలీలో తన తల్లి హీరాబెన్ ఫోటో చూసి భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు.
భోపాల్: దేశానికి రాజైనా తల్లికి కొడుకేననే నానుడు మరోసారి రుజువైంది. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections 2024) ప్రచారంలో సుడిగాలి పర్యటనలు జరుపుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శుక్రవారంనాడు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో భావోద్వాగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపేశారు. ఆయనను అంతగా కదిలించిన విశేషంలోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని దమెహ్‌లో మోదీ ప్రసంగిస్తుండగా, సభికుల్లో ఒకరు మోదీని ఆయన తల్లి హీరోబెన్ (Heeraben) ఆశీర్వదిస్తున్న ఒక ఫోటోను ప్రదర్శించారు. అది మోదీ కంటబడటంతో ఒక్కసారిగా ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. తల్లి జ్ఞాపకాలతో ఆయన కాసేపు మాట్లాడలేకపోయారు. వెంటనే తమాయించుకుని ఆ ఫోటోను ప్రదర్శించిన యువకుడిని మెచ్చుకుంటూ ఆ ఫోటో వెనుక అతని పేరు, చిరునామా రాసివ్వాలని కోరారు. తాను స్వయంగా లేఖ రాస్తానని వేదికపై నుంచే చెప్పడంతో సభికులు సైతం భావోద్వేగానికి లోనై, ఆ తర్వాత మోదీకి ఉన్న మాతృప్రేమపై ప్రశంసలు కురించారు.
Shah Rukh Khan: కాంగ్రెస్ ప్రచారంలో 'షారూక్'.. అసలు సంగతేమిటంటే?
హీరోబెన్ 100 ఏళ్లు పూర్తి చేసుకుని 2022 డిసెంబర్ 30న కన్నుమూశారు. ఆ సమయంలో తల్లి కన్నుమూసిన దుఃఖాన్ని మోదీ దిగమింగుకుంటూ వర్చువల్‌గా అధికారిక బాధ్యతలు నిర్వహిస్తూనే తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
జాతీయ వార్తలు కోసం...