Home » Maha Shivratri
Numerology Mahashivratri: శివ భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహా శివరాత్రి పర్వదినం వచ్చేసింది. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుకోనున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఏయే తేదీల్లో పుట్టిన వారికి శివానుగ్రహం ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం..
మహా శివరాత్రి(Maha Shivaratri) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ టూరిజం శాఖ(Telangana Tourism Department) ప్రత్యేక బస్సులను నడపనుంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని ప్రఖ్యాతి గాంచిన శైవక్షేత్రాలకు తీసుకెళ్లి వచ్చేందుకు ప్యాకేజీలను ప్రకటించింది.
శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ మంగళ, బుధ, గురువారాల్లో జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను(Special buses) ఏర్పాటు చేసింది.
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లుకు చెందిన గట్టెం వెంకటేశ్ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పెన్సిల్ ముల్లుపై పరమేశ్వరుడి రూపాన్ని తీర్చిదిద్దారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి రావణ వాహనంపై విహరించారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
దక్షిణకాశీగా... హరిహర క్షేత్రంగా... కోడెకడితే కోటి వరాలిచ్చే ఎములాడ రాజన్నగా... రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయం ప్రసిద్ధి. దక్షిణకాశీగా పేరుగాంచిన ఈ ప్రసిద్ధ శైవక్షేత్రం మహాశివరాత్రికి ముస్తాబవుతున్న సందర్భంగా ఆలయ విశేషాలివి...
మహాశివరాత్రి(Mahashivratri) నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఫిబ్రవరి 25, 26 తేదీల్లో కీసరగుట్టకు ఆర్టీసీ 200కు పైగా ప్రత్యేక బస్సులు నడుపనుంది.
కేంద్ర హోం శాఖామంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్‌షా(Senior BJP leader Amit Shah) ఈ నెల 26న ఒకరోజు రాష్ట్రానికి రానున్నారు. ఆయన కోవై జిల్లా వెలయంగిరి ప్రాంతంలోని ఈషా ఆశ్రమంలో జరిగే శివారాత్రి వేడుకల్లో పాల్గొంటారు.
Maha Sivaraththiri: శ్రీకాళహస్తిలో కొలువు తీరిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవం జరగనున్నాయి. ఇవి ఫిబ్రవరి 21వ తేదీ నుంచి మార్చి 6వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.