MP Etala: ప్రపంచం మెచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ
ABN , Publish Date - Jan 02 , 2025 | 10:13 AM
భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు.
హైదరాబాద్: భారతదేశమే కాకుండా ప్రపంచం మెచ్చిన మహోన్నతమైన వ్యక్తి మహాత్మాగాంధీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajgiri MP Etala Rajender) పేర్కొన్నారు. రక్తపు బొట్టు చిందించకుండా దేశానికి స్వాతంత్రం సాధించడం ద్వారా ప్రపంచానికి అహింస పద్ధతితో పోరాటం అనే ఆయుధాన్ని గాంధీ అందించారని ఆయన అన్నారు. బుధవారం ఆయన స్థానిక ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, భేతి సుభాష్ రెడ్డి, బీఆర్‌ఎస్ మల్కాజ్‌గిరి పార్లమెంటు ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఉప్పల్‌లో గాంధీ విగ్రహాన్ని పునఃప్రారంభం చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కుళ్లిపోయిన టమాటాలు, బొద్దింకలు
రోడ్డు విస్తరణలో తొలగించిన 1948 నాటి గాంధీ విగ్రహం స్థానంలో కొత్తగా తయారు చేయించిన విగ్రహాన్ని ఉప్పల్ భారత్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో తిరిగి ప్రతిష్టించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మేకల శివారెడ్డి, భారత్‌యూత్ క్లబ్ అధ్యక్షుడు అర్జున్‌గౌడ్, బజారు మురళీకృష్ణగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బేతి సుభాష్‌రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి, ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, క్లబ్ ప్రతినిదులు దుబ్బ నర్సింహారెడ్డి, సల్లా రాజిరెడ్డి, సల్లా వీరారెడ్డి, బిక్కుమల్ల అంజయ్య, బజారు జగన్నాధ్‌గౌడ్, నారాయణ, బీఆర్‌ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్‌ముదిరాజ్, మేకల మధుసూదన్‌రెడ్డి, సాయిజెన్ శేఖర్, నాగేశ్వర్‌రావు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Hyderabad Metro: మేడ్చల్.. శామీర్‌పేటకు మెట్రో!
ఈవార్తను కూడా చదవండి: రైతు భరోసాపై మంత్రి కోమటిరెడ్డి కీలక ప్రకటన
ఈవార్తను కూడా చదవండి: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
ఈవార్తను కూడా చదవండి: తాటిబెల్లం తింటే...
Read Latest Telangana News and National News