Share News

కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తాం!

ABN , Publish Date - Apr 04 , 2025 | 05:38 AM

నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్స్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట కలెక్టర్లకు ఈ-మెయిల్స్‌ వచ్చాయి.

కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తాం!

  • నాగర్‌కర్నూల్‌, మల్కాజిగిరి కలెక్టర్లకు బెదిరింపులు

  • మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట ఈ-మెయిల్స్‌

  • బాంబు స్క్వాడ్‌లతో తనిఖీ.. ఏమీ లేదని నిర్ధారణ

నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌ ప్రతినిధి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టరేట్లను బాంబులతో పేల్చేస్తామంటూ వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్స్‌తో ఒక్కసారిగా కలకలం రేగింది. కరీంనగర్‌కు చెందిన మావోయిస్టు ముప్పాళ్ల లక్ష్మణ్‌రావు పేరిట కలెక్టర్లకు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌ భవనాన్ని గురువారం మధ్యాహ్నం 3:30 గంటలకు పేల్చేస్తామంటూ కలెక్టర్‌ బదావత్‌ సంతో్‌షకు ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ జిల్లా ఎస్పీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌కు తెలియజేశారు. తక్షణమే ఎస్పీ, డీఎస్పీ శ్రీనివా్‌సయాదవ్‌లు బాంబు, డాగ్‌స్క్వాడ్‌లను పంపగా.. కలెక్టరేట్‌లో అణువణువూ తనిఖీచేసి బాంబులకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీలేవని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అంతకు ముందు బాంబు విషయం కలెక్టరేట్‌ అంతా తెలియడంతో సిబ్బంది ప్రాణభయంతో బయటకు పరుగులుతీశారు.


కలెక్టర్‌కు ఈ-మెయిల్‌ పంపిన ఐడీని సైబర్‌క్రైమ్‌కు అప్పగించామని, విచారణ జరిపి నిందితులను అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కాగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో మేడ్చల్‌-మల్కాజిగిరి కలెక్టర్‌ గౌతమ్‌ అధికారిక మెయిల్‌కు కలెక్టరేట్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు మెసేజ్‌ వచ్చింది. అప్రమత్తమైన కలెక్టర్‌ శామీర్‌పేట పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు కలెక్టరేట్‌కు చేరుకుని సిబ్బందిని బయటకు పంపి బాంబు, డాగ్‌ స్క్వాడ్‌లతో తనిఖీ చేపట్టారు. అనుమానాస్పద వస్తువులేమీ కనిపించకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మెయిల్‌ అడ్రస్‌ తనిఖీ చేయగా మావోయిస్టు లక్ష్మణ్‌రావు పేరు చూపినట్టు సమాచారం. మెయిల్‌ చివర్లో ‘అల్లాహు అక్బర్‌’ అని కూడా ఉన్నట్లు తెలిసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వల్పంగా తగ్గిన గోల్డ్, వెండి ధరలు..

వక్ఫ్‌ బిల్లుకు లోక్‌సభ ఓకే

For More AP News and Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:38 AM