Share News

Rahul Gandhi: డీసీసీలే పార్టీకి ఫ్రంట్‌ వారియర్స్‌

ABN , Publish Date - Mar 28 , 2025 | 04:41 AM

కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షులే ఫ్రంట్‌ వారియర్స్‌ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. డీసీసీ అధ్యక్షులు అంటే పార్టీకి దూతలు కాదని, రక్షణ రేఖలని చెప్పారు.

Rahul Gandhi: డీసీసీలే పార్టీకి ఫ్రంట్‌ వారియర్స్‌

  • మీరు దూతలు కాదు.. పార్టీకి రక్షణ రేఖలు

  • బలహీన వర్గాలపై దాడుల నిర్మూలనకే కుల గణన.. డీసీసీ అధ్యక్షుల భేటీలో ఖర్గే

  • కాంగ్రెస్‌కు జిల్లా అధ్యక్షులే పునాది: రాహుల్‌

  • తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల డీసీసీల సమావేశం

న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షులే ఫ్రంట్‌ వారియర్స్‌ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. డీసీసీ అధ్యక్షులు అంటే పార్టీకి దూతలు కాదని, రక్షణ రేఖలని చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా 13 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన డీసీసీ అధ్యక్షులతో ఖర్గే సమావేశం నిర్వహించారు. సమావేశానికి 338 జిల్లాలకు చెందిన అధ్యక్షులు హాజరయ్యారు. ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాకూర్‌ తదితరులు దిశానిర్దేశం చేశారు. డీసీసీ అధ్యక్షులకు మరిన్ని అధికారాలను కట్టబెడతామని పార్టీ అగ్రనేతలు హామీ ఇచ్చారు. తొలుత ఖర్గే మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ, ఆర్‌ఎ్‌సఎస్‌ చూస్తున్నాయని.. ఇందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పోరాటం కొనసాగుతోందని తెలిపారు. ఈ పోరాటాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులపై ఉందన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 240 సీట్లకే పరిమితం చేయడంలో విజయం సాధించామన్నారు. మరింత కష్టపడి ఉంటే కాంగ్రెస్‌ మరో 20 నుంచి 30 స్థానాలు సులభంగా వచ్చేవని, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉండేదన్నారు. దేశంలోని పేదలు, అణగారిన వర్గాలపై దాడులను నిర్మూలించేందుకు కుల గణన డిమాండ్‌ వచ్చిందన్నారు. రాష్ట్ర స్థాయి ఎన్నికల్లో విజయం కోసం దీర్ఘకాలిక వ్యూహంతో ఐక్యంగా ముందుకెళ్లాలని జిల్లా అధ్యక్షులకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం.. తెలంగాణ, కర్ణాటకలో స్వతంత్రంగా.. తమిళనాడులో కూటమితో అధికారంలో ఉన్నామని తెలిపారు. వచ్చే ఏడాదిలో అసోం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయని, ఆయా జిల్లాలోని ప్రతి అభ్యర్థికి విజయం సాధించడం కోసం పార్టీ శ్రమిస్తుందని స్పష్టం చేశారు.


పార్టీకి జిల్లా అధ్యక్షులే పునాది: రాహుల్‌ గాంధీ

కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షులే పునాది అని, వారు లేకుండా పార్టీ అభివృద్ధి సాధ్యంకాదని పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తెలిపారు. విజయ సాధనలో డీసీసీలదే కీలక పాత్ర అని చెప్పారు. తమ పోరాటం ఆర్‌ఎ్‌సఎస్‌, బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే కాదని... దేశంలోని ప్రతి పౌరుడు కలలు కనే సమాజాన్ని స్థాపించడం, హక్కులను సాధించడం కోసమని పేర్కొన్నారు. కాగా ఈ సమావేశంలో తెలంగాణ నుంచి జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌, మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు సురేఖకు మాట్లాడే అవకాశం కల్పించారు. భారత్‌ జోడో యాత్రతో దేశవ్యాప్తంగా పార్టీకి ఎంతో మైలేజ్‌ వచ్చిందని, తెలంగాణలో రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల నాటికి పార్టీ సోషల్‌ మీడియా వింగ్‌ను మరింత యాక్టీవ్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాగా పీసీసీల నుంచి గ్రామ స్థాయి కమిటీ వరకు పనిచేసేవారికే పార్టీ పదవులివ్వాలని సురేఖ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఇతడి తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..

Road Accident: వారణాసిలో రోడ్డు ప్రమాదం.. సంగారెడ్డి వాసులు మృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 04:41 AM