Home » Mamata Banerjee
బెంగాల్ తగలబడితే దేశ రాజధాని ఢిల్లీతో పాటు, అసోం, ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖాండ్, ఒడిసా కూడా కాలిపోతాయని టీఎంసీ అధ్యక్షురాలు, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఎంపీ శత్రుఘ్నుసిన్హా సమర్ధించారు. ఎంతో మెచ్యూరిటీతో మమత వ్యవహరించారని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని మోదీకి శుక్రవారం మరో లేఖ రాశారు. హత్యాచార ఘటనలకు పాల్పడే వారిని శిక్షించేందుకు కఠిన చట్టం తీసుకురావాలని, నిర్దిష్ట కాలపరిమితిలో కేసుల్ని పరిష్కరించేలా అది ఉండాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
కోల్కతాలోని జూనియన్ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశవ్యాప్తంగానే కాకుండా, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో లేఖ రాశారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి.ఆనంద్ బోస్ శుక్రవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోల్కతాలో చోటు చేసుకున్న తాజా పరిస్థితులపై ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తుంది.
కోల్కతాలో జూనియర్ డాక్టర్ అభయ(పేరు మార్చాం) హత్యాచార ఘటనపై మండిపడుతూ వైద్య విద్యార్థులు చేస్తున్న నిరసనలపై సీఎం మమతా బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఆర్ జీ కర్ మెడికాల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగి 21 రోజులయింది. ఆమె మృతిపై దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
జూనియర్ వైద్యురాలి హత్యాచార ఘటన అంశంలో తృణమూల్ కాంగ్రె్స(టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.
''బెంగాల్ తగలబడితే అసోం కూడా తగులబడుతుంది'' అంటూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసోంను బెదరించడానికి మీకెంత ధైర్యం అంటూ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో దీదీని నిలదీశారు.
పశ్చిమబెంగాల్లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.