Suvendu Adhikari: ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం కేసులో సీఎం మమత ఫోన్ కాల్స్ తనిఖీ చేయాలి
ABN , Publish Date - Sep 05 , 2024 | 07:27 PM
ఆర్‌జీ కర్ హాస్పిటల్ కేసు విషయంలో సీఎం మమతా బెనర్జీ మొబైల్ ఫోన్ తీసుకుని ఆగస్ట్ 9, 10 తేదీల్లో కాల్ రికార్డులను తనిఖీ చేయాలని ప్రతిపక్ష నేత సువేందు అధికారి అన్నారు. అప్పుడు అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. అంతేకాదు నిజానిజాలు తెలియాలంటే ముందుగా సీఎంను విచారించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ డిమాండ్ చేశారు.
కోల్‌కతా(kolkata) ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం కేసు విషయంలో బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు విషయంలో సీఎం మమతా బెనర్జీ(Mamata banerjee) ఫోన్ తీసుకుని ఆగస్ట్ 9, 10 తేదీల్లో కాల్ రికార్డులను తనిఖీ చేయాలని కోరారు. అప్పుడు అన్నీ విషయాలు వెలుగులోకి వస్తాయని వెల్లడించారు. తొలుత కోల్‌కతా పోలీసులు తప్పుడు వార్తలను ప్రచారం చేసినందుకు చాలా మందికి సమన్లు పంపారని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు కోల్‌కతా పోలీసులు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ముందుగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విచారించాలని పేర్కొన్నారు.
అంగీకరించలేదు
మమతా బెనర్జీకి చెందిన వ్యక్తులు ఆగస్టు 9లోపు పునరుద్ధరణ ఆర్డర్ (ఆర్‌జీ కర్ హాస్పిటల్ సెమినార్ హాల్ సమీపంలోని గది) పీడబ్ల్యుడీకి ఇచ్చినట్లు చెబుతున్నారు. కానీ ఈ విషయంలో అక్రమాలు జరిగాయని సువేందు అధికారి ఆరోపించారు. మమతా ఫోన్ తీసుకుని కాల్ రికార్డులను పరిశీలిస్తే అన్నీ బయటకు వస్తాయన్నారు. ఈ ఘటనలో రేపిస్టులకు ఉరిశిక్ష పడుతుంది. కానీ వారిని రక్షించే వారి పరిస్థితి ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించి చట్టాలను సవరించాలని డిమాండ్ చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంగీకరించలేదని ప్రశ్నించారు.
పోలీసులు
మరోవైపు ఫేక్ న్యూస్‌ని స్ప్రెడ్ చేస్తున్నారంటూ కోల్‌కతా పోలీసులు ప్రజలకు సమన్లు పంపడం గతంలో చూశాం. కానీ ఇప్పుడు కోల్‌కతా పోలీసులే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చూస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లాకెట్ ఛటర్జీ అన్నారు. నిజానిజాలు తెలియాలంటే ముందుగా సీఎంను విచారించాలని ఆమె అన్నారు. ఇది వ్యవస్థీకృత నేరం సందీప్ ఘోష్‌తోపాటు ఈ కేసులో పెద్ద పేర్లు కూడా ఉన్నాయని ఆరోపించారు. అయితే అసలు TMC ప్రభుత్వం 21 మంది న్యాయవాదులను సుప్రీంకోర్టుకు ఎందుకు పంపిందని ఆమె ప్రశ్నించారు.
మమతకు లింకులు
సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని ఇది వ్యవస్థీకృత నేరమని లాకెట్ ఛటర్జీ పేర్కొన్నారు. సందీప్ ఘోష్‌కు క్లీన్ చిట్ ఇచ్చిన కేసులోనే అతడిని అదుపులోకి తీసుకోవడం ఎలా సాధ్యమైందని ప్రశ్నించారు. అంటే ఇది చేసింది ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. ఇందులో మమతా బెనర్జీ హస్తం ఉందా? ఇప్పుడు సందీప్ ఘోష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సందీప్ ఘోష్ ఒక రాకెట్ నడుపుతున్నాడు. బాడీ ఆర్గాన్ రాకెట్, డెడ్ బాడీ రాకెట్ నడుపుతున్నాడు. ఆయన విద్యార్థులను పాస్ చేయడానికి కూడా లంచం తీసుకునేవాడని ఆరోపించారు. ఆయనతోపాటు మొత్తం ఓ బృందం ఉంది. దీని లింకులు మమతా బెనర్జీకి కూడా అనుసంధానించబడ్డాయని ఆమో ఆరోపించారు.
ఇవి కూడా చదవండి:
Delhi High Court: వికీపీడియాను మందలించిన ఢిల్లీ హైకోర్టు.. కారణమిదే..
Bangalore: చార్జ్‌షీట్‌లో.. ఏ2గా స్టార్ హీరో దర్శన్
Minister: ఇలాంటి నటులు దేశాన్ని కాపాడగలరా?
Read More National News and Latest Telugu News