Home » Manipur
దాదాపు రెండు నెలల నుంచి హింసాత్మక సంఘటనలతో అట్టుడికిపోతున్న మణిపూర్ రాష్ట్రాన్ని చక్కదిద్దేందుకు వచ్చిన సైన్యాన్ని స్థానిక మహిళలు అడ్డుకుంటున్నారు. సైనిక వాహనాలు నడవకుండా పెద్ద ఎత్తున రోడ్లపైకి చేరుతున్నారు. కొన్ని చోట్ల రోడ్లను తవ్వేస్తున్నారు. వీరి రక్షణతో హింసాత్మక నిరసనకారులు తప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతల పునరుద్ధరణకు తమకు సహకరించాలని సైన్యం ట్విటర్ వేదికగా ప్రజలందరినీ కోరింది.
మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఐతమ్ గ్రామంలో మిలిటెంట్లను విడిపించుకునేందుకు దాదాపు 1200 మంది మహిళలు చుట్టుముట్టడంతో కేవైకేఎల్గ్రూ ప్‌కు చెందిన 12 మంది మెయిటీ మిలిటెంట్స భ్యులను ఆర్మీవిడుదల చేసింది.
మణిపూర్‌లో హింసాకాండ శుక్రవారం రాత్రి మళ్లీ ప్రారంభమైంది. షెడ్యూల్డు తెగల జాబితాలో ఉన్నవారు మే 3న ప్రారంభించిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారి, రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వయంగా ఈ రాష్ట్రాన్ని సందర్శించి రాష్ట్రంలోని అన్ని వర్గాల నేతలతో మాట్లాడినప్పటికీ ప్రశాంతత నెలకొనడం లేదు.
ఇంఫాల్‌లోని కాంగ్బ ప్రాంతంలో తన ఇంటిపై ఆందోళననకారులు దాడి చేసి, దహనం చేయడంపై కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన తనను తీవ్ర ఆందోళనకు, దిగ్భ్రాంతికి గురిచేసిందని, మణిపూర్‌లో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు.
మణిపూర్‌లో హింసాకాండ ఆగడం లేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్వయంగా రంగంలోకి దిగి అన్ని వర్గాలతో చర్చలు జరిపినప్పటికీ నిరసనకారులు వెనుకంజ వేయడం లేదు. తాజాగా గురువారం విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఆర్కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసంపై దాడి చేసి, దహనం చేశారు.
రెండు వర్గాల మధ్య వైరంతో కుతకుతలాడుతున్న మణిపూర్‌లో శాంతి చర్యలకు మళ్లీ విఘాతం కలిగింది. మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లోని ఖమెన్‌లాక్ ప్రాంతంలో తిరిగి హింసాకాండ చెలరేగింది. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల్లో ఒక మహిళతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గాయపడ్డారు.
మణిపూర్‌లో గత నెల నుంచి ఘర్షణలు జరుగుతుండటానికి కారణం బీజేపీ/ఆరెస్సెస్ రాజకీయాలేనని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఆరోపించారు.
హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో తిరుగుబాటుదారులు మళ్లీ రెచ్చిపోయారు. సోమ-మంగళవారాల మధ్య రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో బీఎస్ఎఫ్
అల్లర్లు, హింసాకాండంతో అట్టుడికిన మణిపూర్‌లో శాంతిని పాదుకొలుపుదామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. మణిపూర్‌లో తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం ఆయన వరుస ట్వీట్లలో రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు ప్రజలందరూ కలిసిరావాలని కోరారు.
మణిపూర్‌లో జరిగిన విస్తృత హింసాకాండపై విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ కమిటీ చేత దర్యాప్తు చేయిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.