Home » Medigadda Barrage
కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఒక మేడిగడ్డ మాత్రమే కుంగిందని.. దాన్ని భూతద్దంలో పెట్టీ చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) అన్నారు.
కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య.. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపించారు.
మేడిగడ్డ అంశంలో ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది. ఈ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwara Project)లో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) కుంగుబాటుపై విచారణ చేపట్టేందుకు విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీ రాజీవ్ రతన్ రంగంలోకి దిగారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ( Minister Uttam Kumar Reddy ) ప్రకటించారు. మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలల్లో విజిలెన్స్ అధికారులు విస్తృత తనిఖీలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ చెప్పారు.
Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
జయశంకర్ భూపాలపల్లి: మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు మంత్రుల బృందం శుక్రవారం రానుంది. ఇక్కడే బ్యారేజీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు ( Medigadda project ) కు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, అన్నారంలో జరిగిన లోపాలపై దర్యాప్తు జరిపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు ( Minister Sridhar Babu ) తెలిపారు.
మేడిగడ్డ కుంగడంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్రెడ్డి ( CM Revanth Reddy ) స్పష్టం చేశారు. శనివారం నాడు అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ..త్వరలోనే ప్రజాప్రతినిధులను మేడిగడ్డకు తీసుకెళ్తాం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.