Share News

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం: పైడి రాకేష్ రెడ్డి

ABN , Publish Date - Feb 10 , 2024 | 05:37 PM

కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య.. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపించారు.

BJP: వారిద్దరికి పంపకాల్లో తేడాలు.. అందుకనే ఈ నాటకం:  పైడి రాకేష్ రెడ్డి

హైదరాబాద్: మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించడానికి మంత్రుల బృందంతో కలిసి వెళ్తున్నామని ప్రతిపక్షాలు కూడా తమతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం నాడు తెలంగాణ అసెంబ్లీలో సూచించారు. అయితే ఈ విషయంపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి(Rakesh Reddy) స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో మేడిగడ్డ వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. మాజీ సీఎం, ప్రస్తుత సీఎం మధ్య.. పంపకాల విషయంలో తేడాలు వచ్చాయని ఆరోపించారు.

కేసీఆర్ నుంచి రావాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ కోసమే సీఎం రేవంత్ మేడిగడ్డ నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం నాడు ఏబీఎన్‌తో ఆయన మాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి రాజకీయం మెదలు పెట్టాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. కొడంగల్, నారాయణ పేట్ ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లు ఎలా కేటాయిస్తారు? అని ప్రశ్నించారు. మంత్రులు సొంత జిల్లాలకే మంత్రులా? లేకా రాష్ట్రానికి మంత్రులా? అని ప్రశ్నించారు. అన్ని నిధులను ఖమ్మం, నల్లగొండ జిల్లాలకే కేటాయిస్తున్నారని మండిపడ్డారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు నిధులు ఇవ్వకుంటే.. ఉత్తర తెలంగాణ నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా మారే ప్రమాదం ఉందని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి హెచ్చరించారు.

Updated Date - Feb 10 , 2024 | 05:38 PM