BJP: ఇప్పుడు మేడిగడ్డకు వెళ్లి కొత్తగా చూడాల్సిందేమీ లేదు..
ABN , Publish Date - Feb 12 , 2024 | 11:18 AM
Telangana: రేపు (మంగళవారం) ‘చలో కాళేశ్వరం’కు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి స్పందించారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ...
హైదరాబాద్, ఫిబ్రవరి 12: రేపు (మంగళవారం) ‘చలో కాళేశ్వరం’కు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుపై బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి (BJP MLA Rakesh Reddy) స్పందించారు. సోమవారం అసెంబ్లీలో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఎమ్మెల్యే మాట్లాడుతూ... సూట్ కేసుల్లో తేడాలు వచ్చాయి కాబట్టే మేడిగడ్డ సందర్శనకు ప్రభుత్వం వెళ్తుందన్నారు. మేడిగడ్డ సందర్శనకు బీజేపీ వెళ్లటం లేదని స్పష్టం చేశారు. మంత్రులు, అధికారులు గతంలోనే వెళ్లి పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు కదా అని అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని అందరకీ తెలిసిందే అని.. ఇప్పుడు కొత్తగా వెళ్లి చూడాల్సిందేమి లేదని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..