Home » MLC Elections
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలూ లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తెలంగాణలో వరంగల్,నల్గొండ,ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రతి మండలానికి ఒక పోలింగ్ కేంద్రాన్ని అధికారులు ఏర్పాటుచేశారు.
నేడు నల్గొండ -ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్ జరగనుంది.12 జిల్లాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులున్నారు. బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకే్‌షరెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ డబ్బు ద్వారా మాత్రమే గెలవాలని దుర్మార్గమైన ప్రయత్నం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు (Raghunandan Rao) ఆరోపించారు. రేపు జరిగే పట్టభద్రుల ఎన్నికలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి బీఆర్ఎస్ ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్సీలను, ఇన్చార్జిగా నియమించారని చెప్పారు.
మూడు ఉమ్మడి జిల్లాలు.. ఐదు లోక్‌సభ నియోజకవర్గాలు.. 35 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉన్న శాసనమండలి స్థానం. 4,63,839 మంది పట్టభద్రులైన ఓటర్లకు 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచిన నియోజకవర్గం.
అబద్ధాల గ్యారెంటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు (Ramachandra Rao) అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి కోసం ఖమ్మం జిల్లాలో రామచంద్రరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ విద్యార్థులకు సమస్యలు సృష్టించిందే మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ (Balmoori Venkat) ఆరోపించారు. తాను విద్యార్థుల నుంచి వచ్చానని. విద్యార్థుల సమస్యలన్నీ తనకు తెలుసునని తెలిపారు. పదేళ్ల కాలంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టే అనేక నిర్ణయాలను కేటీఆర్ తీసుకున్నారని మండిపడ్డారు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ధీమా వ్యక్తం చేశారు. ఎంపీ ఎన్నికల్లో రెండోస్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటలాడుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Eatala Rajendar) ఆరోపించారు. నిరుద్యోగులపై సీఎం రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుక అని చెప్పుకునే కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న సోషల్ మీడియాలో ఆయన బాగోతం అందరికీ తెలుసునని చెప్పుకొచ్చారు.