Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ ఈడి కేసులో జూలై 25 వరకు కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించడం జరిగింది. ఇవాళ్టితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కవితను జైలు అధికారులు హాజరుపరిచారు. తదుపరి కేసు విచారణ జూలై 25 కి రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందన్న ఆశలు అడియాసలుగానే మారుతున్నాయి.
మూడు నెలలుగా తీహార్ జైలులో ఉన్న కవిత బెయిల్ పిటిషన్పై ఈరోజు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అవకతవకలు జరిగాయని సీబీఐ , ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం కవిత అరెస్ట్ అయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై సోమవారం (జూలై 1) ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశముంది.
న్యూఢిల్లీ: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు అయి తిహాడ్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం ఉదయం ఆయన భేటీ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీ శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే..
తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో ఆమె సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ములాఖత్ అయ్యారు. కవిత యోగ క్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత పాత్ర, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ చార్జిషీట్ను దాఖలు చేసినట్టు సీబీఐ శుక్రవారం రౌస్అవెన్యూ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది.
ఢిల్లీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు జ్యుడీషియల్ కస్డడీ కోరుతూ నేడు( శుక్రవారం) సీబీఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీంతో మరోసారి కవితకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించింది. జూన్ 21 వరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు కస్డడీని పొడిగించింది.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించిన కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ చట్టంలోని సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రత్యేక కోర్టును కోరింది. ఆమె ఆస్తుల స్వాధీనానికి ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. మద్యం కుంభకోణంలో మొత్తం రూ.1100 కోట్ల మేరకు అక్రమాలు జరిగాయని, ఇందులో కవిత పాత్ర రూ.292 కోట్ల మేరకు ఉందని తెలిపింది.