Home » MLC Kavitha
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులోఎమ్మెల్సీ కవితను కష్టాలు వెంటాడుతున్నాయి. ఓవైపు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఇప్పటివరకు ఉపశమనం కలగకపోవడంతో కవిత తీహార్ జైలులోనే ఉన్నారు. దేశ వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవితే కింగ్‌పిన్ అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఢిల్లీ మద్యం పాలసీలో ఆమెది కీలకపాత్ర అని కోర్టుకు వివరించింది. కవిత పాత్ర లేకపోతే ఆమె సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించింది.
దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిగింది. ఢిల్లీ హైకోర్టులో జరిగిన బెయిల్ విచారణలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పేరు ప్రస్తావన వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
తన కుమార్తె, ఎమ్మెల్సీ కవితను.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీ నేత బీఎల్ సంతోష్ అరెస్టుకు నాటి సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారా? బీజేపీ అధిష్ఠానంతో నేరుగా బేరసారాలు ఆడేందుకే ఆ
Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్యే కవిత(MLC Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో(Delhi High Court) శుక్రవారం విచారణ జరిగింది. ఈ కేసులో వాదనలను సోమవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. ఈడీ అరెస్ట్ చేసిన విధానం.. కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ చెప్పిన విషయాలపై కవిత తరఫున న్యాయవాది కోర్టుకు ..
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై శుక్రవారం ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ స్వర్ణకాంత శర్మ ధర్మాసనం విచారణ జరపనుంది. ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిల్ తిరస్కరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ కవిత హైకోర్టులో పిటిషన్ వేశారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై మంగళవారం విచారణ ముగిసింది. ఈడీ దాఖలు చేసిన ఏడవ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌పై ప్రత్యేక న్యాయస్థానం విచారణ జరిపింది. 8 వేల పేజీలతో కూడిన ఛార్జిషీటును ఈడీ దాఖలు చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ ఈరోజు(సోమవారం)తో ముగిసింది. దీంతో ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.
ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సీబీఐ, ఈడీ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ నేటితో రిమాండ్ ముగుస్తోంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరుఫు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికి పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయ్యింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) జ్యుడీషియల్ కస్టడీ రేపటితో(సోమవారం) ముగియనున్నది. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ రేపు విచారణ జరగనున్నది. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 2గంటలకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించే విషయంపై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనున్నది. జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో కవితను కోర్టు ముందు ఈడీ, సీబీఐ హాజరు పరిచే అవకాశం ఉంది.