Share News

Supreme Court Notices: సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌కు నోటీసులు

ABN , Publish Date - Apr 02 , 2025 | 02:53 AM

అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణల కేసులో ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయగా, దీనిపై సమాధానం ఇవ్వాలని సంజయ్‌కు నాలుగు వారాల గడువు విధించబడింది

 Supreme Court Notices: సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌కు నోటీసులు

  • 4 వారాల్లో కౌంటర్‌ దాఖలుకు సుప్రీం ఆదేశం

  • ఏసీబీ కేసులో ధర్మాసనం జారీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): అగ్నిమాపక విభాగంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ కేసులో ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ మాజీ చీఫ్‌ సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ కేసులో ఏపీ హైకోర్టు సంజయ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును గత నెల 5న ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్‌ అమానుల్లా, జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిందితుడు బెయిల్‌పై ఉంటే కేసును ప్రభావితం చేసే అవకాశముందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు కౌంటర్‌ దాఖలు చేయాల్సిందిగా సంజయ్‌కు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. నాలుగు వారాల్లో ఆ నోటీసులకు సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఈ కేసు మరోసారి మే 6న విచారణకు వచ్చే అవకాశముంది. కాగా, సంజయ్‌ అవినీతిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రభుత్వానికి రెండు వేర్వేరు నివేదికలు సమర్పించింది.


అందులో పలు అంశాలు పేర్కొంది. అగ్నిమాపక శాఖలో నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీలు) ఆన్‌లైన్‌లో జారీ చేసేందుకు అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును సౌత్రికా టెక్నాలజీస్‌ అండ్‌ ఇన్‌ఫ్రా సంస్థకు సంజయ్‌ అప్పగించారు. ఎలాంటి పనులూ జరగకపోయినా ఆ సంస్థకు రూ.59.93 లక్షల బిల్లులు చెల్లించేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై సీఐడీ తరఫున దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కాంట్రాక్టును క్రిత్వ్యాప్‌ టెక్నాలజీస్‌కు ఇచ్చి, రూ.1.19 కోట్లు చెల్లించారు. సదస్సులు మొత్తం సీఐడీ అధికారులే నిర్వహించారు. క్రిత్వ్యాప్‌ సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల పేరిట దోచేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu Comments: బాపట్ల సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Kakani Investigation News: రెండో రోజు విచారణకు కాకాణి గైర్హాజరు

Palnadu Crime: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన యువతి.. ఎందుకంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2025 | 02:54 AM