Share News

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

ABN , Publish Date - Feb 16 , 2025 | 09:21 AM

Actress Krishnaveni: ఎన్టీఆర్‌ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. ఆమె మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Actress Krishnaveni: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత
Krishna Veni passes away

పశ్చిమగోదావరి జిల్లా: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (102) ఇవాళ(ఆదివారం) ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వయోభార సమస్యలతో బాధపడుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 3.00 గంటలకు హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో కృష్ణవేణి అంత్యక్రియలు జరుగనున్నాయి. నందమూరి తారక రామారావు(NTR)ను 'మనదేశం'లో సినీ రంగానికి కృష్ణవేణి పరిచయం చేశారు. తెలుగు సినీ రంగంలో తొలి మహిళా నిర్మాతగా కృష్ణవేణి పేరు సంపాదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో 1924, డిసెంబర్‌ 24న కృష్ణవేణి జన్మించారు. తెలుగులో మొదటగా భారీ పారితోషికం అందుకున్నా నటిగా ఆమెకు పేరుంది. పది సంవత్సరాల సమయంలో అనసూయ చిత్రంలో కృష్ణవేణి టైటిల్ రోల్ పోషించారు. బాలనటిగా 'తుకారాం' చిత్రంలో ఆమె నటించారు. 1938లో 'కచదేవయాని' చిత్రంలో నాయికగా అలరించారు. సుమారు ఇరవై చిత్రాల్లో కృష్ణవేణి నటించారు.


ఇరవై చిత్రాల్లో నటించిన కృష్ణవేణి

తన పాటలను తానే పాడుకున్న నట గాయనిగా కూడా ఆమె పేరు సంపాదించారు. 1940లో మీర్జాపురం రాజాతో ఆమెకు వివాహం జరిగింది. వివాహానంతరం 'భోజ కాళిదాసు'లో కృష్ణవేణి నటించారు. 'మన దేశం'తో నటుడిగా ఎన్టీఆర్‌ను కృష్ణవేణి పరిచయం చేశారు. 1947లో విడుదలైన 'గొల్లభామ'తో గుర్తింపు తెచ్చుకున్నారు. 1942లో కుమార్తె రాజ్యలక్ష్మీ అనూరాధకు కృష్ణవేణి జన్మనిచ్చారు. తల్లి కృష్ణవేణి బాటలో నిర్మాతగా అనూరాధాదేవి రాణించారు. 'కీలుగుర్రం' సినిమాలో అంజలీదేవికి కృష్ణవేణి నేపథ్యగానం అందించారు. ఘంటసాల, రమేశ్‌ నాయుడును సంగీత దర్శకులుగా కృష్ణవేణి పరిచయం చేశారు. గాయనీమణులు పి. లీల, జిక్కీలను కృష్ణవేణినే చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. త్రిపురనేని గోపీచంద్‌ను కూడా సినీ రచయితగా కృష్ణవేణి మార్చారు. 1952లో వచ్చిన 'సాహసం' సినిమాలో ఆమె చివరిగా నటించారు. 1957లో చివరిగా 'దాంపత్యం' చిత్రం నిర్మించారు. కృష్ణవేణి రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. ఇటీవల 'మనదేశం' వజ్రోత్సవ వేడుకలో కృష్ణవేణి పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

DGP Hari Shankar Gupta : మహిళల జోలికొస్తే మరణదండనే!

Deputy CM Pawan Kalyan: ముగిసిన షష్ట షణ్ముఖ క్షేత్ర యాత్ర

Buddha Venkanna : వారికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

Read Latest AP News and Telugu News

Updated Date - Feb 16 , 2025 | 11:09 AM