Home » Nellore
బాపట్ల పట్టణంలో కామాంధుడు వికృత చేష్టలకు పాల్పడ్డాడు. 65 ఏళ్ల ఓ వృద్ధుడు తన వయస్సు కూడా మరిచి 11 ఏళ్ల బాలికపై అత్యాచారయత్నం చేశాడు.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur section) పరిధిలోని తడ, సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా శుక్రవారం సూళ్లూరుపేట, నెల్లూరు వెళ్లే మెము రైళ్లు కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా రద్దయినట్లు దక్షిణ రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో భవన నిర్మాణాల అనుమతులకు నూతన విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఏపీ పట్టణ, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఏపీలో జరుగుతున్న లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కఠిన చర్యలు తీసుకుంటున్న నేరస్తుల్లో మార్పు రావడం లేదని పవన్ కల్యాణ్ అన్నారు.
చెన్నై సెంట్రల్-గూడూరు సెక్షన్(Chennai Central-Gudur Section)లోని తడ-సూళ్లూరుపేట మధ్య రైలుమార్గంలో మరమ్మతుల కారణంగా మూర్మార్కెట్ కాంప్లెక్-సూళ్లూరుపేట-నెల్లూరు మార్గంలో పలు మెము, సబర్బన్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే(Southern Railway) ఒక ప్రకటనలో తెలిపింది.
వైసీపీ హయాంలో ఇసుక ట్రాక్టర్లకు లోడ్ చేసేవాళ్ళు కాదని, టిప్పర్లు లోడ్ చేసేవాళ్ళని ఎమ్మెల్యే కోటంరెడ్డి అన్నారు. ఎందుకంటే ట్రాక్టర్లు పేదోళ్ళవి.. టిప్పర్లు ముఖ్యమంత్రివి.. ఇసుక టిప్పర్లు టచ్ చేస్తే సీఎం కార్యాలయం నుంచి కాల్ చేసే వాళ్లని.. ఎస్పీలు, కలెక్టర్లు ఏజంట్లుగా పని చేశారని ఆరోపించారు. అందుకే 11 సీట్లు ఇచ్చి జనం ఛీ కొట్టారన్నారు.
ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించిన 48 గంటల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. మొదటి రకం ధాన్యానికి మద్దతు ధర రూ. 2,350లకు కొంటామని తెలిపారు. రైతులకు నచ్చిన రైస్ మిల్లులో ధాన్యాన్ని రైతులు అమ్ముకోవచ్చుని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నాంచారంపేటలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. చెలగల కాటయ్య అనే టీడీపీ కార్యకర్త ఇంటిపై వైసీపీకి చెందిన దుంపల మధు, అతని అనుచరులు దాడి చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.