Share News

US Visa Crackdown: స్వచ్ఛందంగా వెళ్లిపోండి

ABN , Publish Date - Mar 30 , 2025 | 04:14 AM

అమెరికా విదేశాంగ శాఖ, క్యాంపస్‌ ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులకు ఈ-మెయిల్స్‌ పంపింది, వారితో పాటు జాతి వ్యతిరేక సందేశాలు షేర్‌ చేసినవారికి కూడా హెచ్చరికలు జారీ చేయబడినట్టు అధికారులు తెలిపారు. ఈ నిర్ణయం ప్రకారం, 300 మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి.

US Visa Crackdown: స్వచ్ఛందంగా వెళ్లిపోండి

క్యాంపస్‌ ఆందోళనల్లో పాల్గొన్న అంతర్జాతీయ విద్యార్థులకు

అమెరికా ఈ-మెయిల్స్‌ ...జాబితాలో భారతీయ విద్యార్థులు !

వాషింగ్టన్‌, మార్చి 29: అమెరికాలోని విశ్వవిద్యాలయాల క్యాంప్‌సలలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న విదేశీ విద్యార్థులంతా స్వచ్ఛందంగా క్యాంపస్‌ విడిచి వెళ్లిపోవాలని ఆ దేశ విదేశాంగ శాఖ ఈ-మెయిల్‌ ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. వీరితో పాటు ఆందోళనలకు సంబంధించిన సమాచారాన్ని, జాతి వ్యతిరేక సందేశాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినవారికి కూడా ఈ-మెయిల్‌ పంపినట్లు ఇమిగ్రేషన్‌ అటార్నీ అధికారులు ధ్రువీకరించారు. వీరిలో కొంతమంది భారతీయ విద్యార్థులు కూడా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సోషల్‌ మీడియా ఖాతాలను కాన్సులేట్‌ అధికారులతో కలసి విదేశాంగ శాఖ ఇటీవల నిశితంగా సమీక్షించింది. ఆ నివేదికల ఆధారంగా తాజా నిర్ణయం తీసుకున్నారు. హమాస్‌, ఇతర ఉగ్రసంస్థలకు మద్దతు పలుకుతున్న అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో ఏఐ ఆధారిత ‘క్యాచ్‌ అండ్‌ రివోక్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఇది అమల్లోకి వచ్చిన మూడు వారాల్లోనే 300 మందికిపైగా విదేశీ విద్యార్థుల స్టూడెంట్‌ వీసాలు రద్దయ్యాయి. ‘మీకు వీసా జారీచేసిన తర్వాత అదనపు సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా అమెరికా ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ చట్టంలోని సెక్షన్‌ 22(1) ప్రకారం మీ ఎఫ్‌-1 వీసా రద్దయింది’ అని విద్యార్థులకు పంపిన ఈ మెయిల్స్‌లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో నివసిస్తున్న భారతీయ వలసదారులపై ట్రంప్‌ ప్రభుత్వం మరో పిడుగు వేసింది. గ్రీన్‌కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసింది. ఆ దేశంలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకొనే వారి వివరాలను మరింత సమగ్రంగా పరిశీలన చేసే లక్ష్యంతో అధ్యక్షుడు ట్రంప్‌ సంతకం చేసిన రెండు కార్యనిర్వాహక ఆదేశాలను పాటించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 04:27 AM