Share News

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’

ABN , Publish Date - Feb 21 , 2025 | 08:17 PM

Nela Nela Telugu Vennela: విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజిందర్ మాట్లాడుతూ.. తాను వివిధ కోర్టుల్లో ఇచ్చిన తీర్పులతోపాటు తన అనుభవాల సమాహారంలో తెలుగులో పలు కథలు రచించారు. ఆ క్రమంలో తన కథా రచన వైశిష్ట్యాన్ని సైతం ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఆయన రచించిన రచనలు.. నేనూ నా నల్లకోటు, మనసు పెట్టి, కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, మా వేములవాడ కథలులో రాసిన కథలు.. జన జీవనంలో విభిన్న పాత్రలతో రూపొందించానని వివరించారు.

NRI: టాంటెక్స్ ఆధ్వర్యంలో ‘కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు’

డాలాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక 'నెల నెలా తెలుగు వెన్నెల' 211వ సాహిత్య సదస్సులో ''కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు'' అంశంపై డాలస్‌లో ఘనంగా నిర్వహించారు. "మనసులోని మర్మమును తెలుసుకో" అంటూ శ్రీ త్యాగరాజ కృత ప్రార్ధన గేయాన్ని శ్రీ లెనిన్ వేముల రాగయుక్తంగా ఆలపించడం ద్వారా ఈ సదస్సు ప్రారంభమైంది. అనంతరం ప్రముఖ కవి దివంగత శ్రీవడ్డేపల్లి కృష్ణ రచించిన ''నెలనెల తెలుగు వెన్నెల'' గీతాన్ని వినిపించారు.

ఆ తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దయాకర్ మాడాను సాహితీ ప్రియులకు పరిచయం చేశారు. ఇక విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ మంగారి రాజిందర్ మాట్లాడుతూ.. తాను వివిధ కోర్టుల్లో ఇచ్చిన తీర్పులతోపాటు తన అనుభవాల సమాహారంలో తెలుగులో పలు కథలు రచించారు. ఆ క్రమంలో తన కథా రచన వైశిష్ట్యాన్ని సైతం ఆయన తెలియజేశారు. ముఖ్యంగా ఆయన రచించిన రచనలు.. నేనూ నా నల్లకోటు, మనసు పెట్టి, కోర్టు తీర్పుల్లో సాహిత్య మెరుపులు, మా వేములవాడ కథలులో రాసిన కథలు.. జన జీవనంలో విభిన్న పాత్రలతో రూపొందించానని వివరించారు.


jumbio1.jpg

కుటుంబ సమస్యలను పరిష్కరించే న్యాయమూర్తిగా ఉన్న సమయంలో కొందరి జీవితాలలో వారికి ఎదురైన సంఘటనలు తన దృష్టికి తీసుకు వచ్చారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆయా కేసులలోని యదార్ధ సంఘటనలను మూలంగా తీసుకొని రాసిన కథల్లో నిర్ణయం, ఆమె కోరిక, సంతృప్తి, చల్లగుండు సత్తెమ్మా, నేల టిక్కెట్టు, ఆఖరి చూపు, కాశమ్మ కథ, ఊరుంది, గాయం, ఇకలేరు, రుక్కమ్మ హోటల్ తదితర కథలు ఉన్నాయని.. వాటిని ఆయన అద్భుతంగా వివరించారు.

Also Read: ప్రజలతో ఉంటానంటూ.. బెంగళూరు ప్యాలెస్‌కు.


jimbo-2.jpg

ఇక తాను న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తూ.. తెలుగులో తీర్పులిచ్చినట్లు తెలిపారన్నారు. తనలాగానే ప్రస్తుత న్యాయమూర్తులు.. తెలుగులో తీర్పులు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ రాజిందర్ జింబో ప్రసంగాన్ని డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్బు జొన్నలగడ్డ, చంద్రహాస్ మద్దుకూరి, కొండా తిరుమల రెడ్డి, లెనిన్ వేముల, దయాకర్ మాడ, శ్రీమతి కాశీనాధుని రాధ, శ్రీమతి రామ సీతామూర్తి, నిడిగంటి గోవర్ధనరావు తదితరులు ప్రశంసించారు.

Also Read: ఇంటర్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్ లోడ్ చేసుకోండి


jimbo3.jpgఆ తర్వాత ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి తరపున పూర్వాధ్యక్షులు సతీష్ బండారుతోపాటు సంస్థ సమన్వయ కర్త శ్రీ దయాకర్ మాడ.. ముఖ్య అతిథి డాక్టర్ మంగారి రాజిందర్ జింబోకి టాంటెక్స్ తరపున సన్మాన పత్రంతోపాటు జ్ఞాపికను చదివి వినిపించి..సన్మానించారు. ఇంత మంది సాహితీ ప్రియుల మధ్య తనకు జరిగిన ఈ సన్మానం అద్భుతమైన అనుభూతిని మిగిల్చిందని డాక్టర్ మంగారి రాజిందర్ జింబో పేర్కొ్న్నారు. ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: చెల్లి లొల్లితో అన్న పార్టీలో గగ్గోలు..


టాంటెక్స్ ద్వారా తెలుగు వారు తెలుగు భాషా సాహిత్యానికి చేస్తున్న సేవ చాలా గొప్పదని ఆయన ప్రశంసించారు. సాహితీ ప్రియులనందరినీ భాగస్వాములను చేస్తూ గత 81 మాసాలుగా నిరాటంకంగా సాగుతోన్న ధారావాహిక ''మన తెలుగు సిరిసంపదలు''చాలా బాగా జరిగింది. తెలుగు భాషా పద సంపదను స్పృశించడం, అక్షర పద భ్రమకాలు ప్రశ్నలుగా సంధించి సమాధానాలను రాబట్టడంలో డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండిని పలువురు ప్రశంసించారు.

Also Read: ప్రారంభమైన యమునా నదిలో కాలుష్య ప్రక్షాళన


తరువాత శాస్త్రీయ సంగీత నిష్ణాతులు, రాగ విశ్లేషకులు పి.చంద్రమౌళి రచించిన ఘంటసాల రాగశాల పుస్తకాన్ని మద్దుకూరి చంద్రహాస్ పుస్తక పరిచయం చేశారు. నేపధ్య గాయకులుగానే కాక సంగీత దర్శకులుగా అద్భుతమైన రాగాలను సృష్టించిన ఘంటసాల శ్రీవెంకటేశ్వరరావుపై చంద్రమౌళి కొత్త కోణాల్లో స్పృశించి రచించారని మద్దుకూరి చంద్రహాస్ పేర్కొన్నారు.

Also Read: తొక్కిసలాటలో 121 మంది మృతి.. బోలే బాబాకు క్లీన్ చీట్


ఈ మాస పద్య సౌగంధంలో కాశీనాధుని రాధ శ్రీకృష్ణ దేవరాయల విరచిత (కృష్ణ చిత్తీయం) ఆముక్త మాల్యద పీఠికలో తొలి పద్యం శ్రీ కమనీయ హారమణి.......వెంకట భర్త గొల చ్చెదన్'' మొదలుగా గల పద్యాలను అద్భుతంగా పాడి సందర్భ సహిత వ్యాఖ్య చేశారు. అనంతరం లెనిన్ వేముల శతక పద్యాలు.. పురాణ కథలు అంశంపై ప్రసంగిస్తూ మహాకవి వేమన పద్యం ఉప్పుకప్పురంబు లోని "పురుషులందు పుణ్య పురుషులువేరయా" అనే పోలికకు ఉదాహరణగా వాలి సుగ్రీవుల వృత్తాంతాన్ని వివరించారు.


ఈ సాహిత్య కార్యక్రమానికి సతీసమేతంగా హాజరైన ముఖ్య అతిథి డాక్టర్ రాజిందర్ జింబో వారి కుటుంబ సభ్యులు అనురాగ్ మంగారి, రాకేష్ మంగారి ,దీపక్ రాజా రోజనాల ఇంకా సంస్థ పూర్వాధ్యక్షులు డాక్టర్ ప్రసాద్ తోటకూర, డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, చిన్న సత్యం వీర్నాపు, శ్రీనివాస కుమారస్వామి రాజ వారి సతీమణి పద్మజ, విజయ్ మందిరం, లెనిన్ వీర తుళ్లూరి, లెనిన్ బంద, లెనిన్ వేముల, రాఘవేంద్ర అమిలినేని, సతీష్ గ్రంధి శ్రీమతి&శ్రీ రామ్ సీతా మూర్తి, శ్రీధర్ నంబూరు,గోవర్ధన రావు నిడిగంటి తదితర సాహితీ ప్రియులు వీక్షించడం ద్వారా ఈ సదస్సు విజయవంతమైంది.


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం సమన్వయ కర్త దయాకర్ మాడ వందన సమర్పణ చేస్తూ సంస్థ పూర్వాధ్యక్షులకూ, సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ.. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ప్రస్తుత అధ్యక్షులు చంద్రశేఖర్ పొట్టిపాటి సంస్థ తక్షణ పూర్వాధ్యకులు సతీష్ బండారు సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి, అధికార కార్యవర్గ బృందం సభ్యులను పలువురు అభినందించారు.

For NRI News And Telugu News

Updated Date - Feb 21 , 2025 | 08:17 PM