Home » NTR
తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఎన్టీఆర్ వంద రూపాయిల నాణాన్ని( NTR Coin) ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం లభిస్తుందని భారత ప్రభుత్వం హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్‌ఆర్ నాయుడు ప్రకటించారు.
ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘‘ఎన్టీఆర్ స్మారక నాణెం’’ ఆవిష్కరించడం తెలుగుజాతికి దక్కిన గొప్ప గౌరవమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా, తెలుగుదేశం పార్టీ వాడిగా, నందమూరి తారకరామారావు మనవడిగా గర్విస్తున్నానన్నారు.
రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. అయితే ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు మాటా మంతీ ఆసక్తికరంగా మారింది. దేశ రాజకీయాలతో పాటు, ఏపీ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగింది.
రాష్ట్రపతి భవన్‌లో ఎన్టీఆర్ స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.
న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శతజయంతి సందర్భంగా కేంద్రం ముద్రించిన రూ.100 స్మారక నాణేం సోమవారం విడుదలకానుంది. ఈ రోజు ఉదయం 10.30 గంటలకు రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నాణెం విడుదల చేస్తారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Sr NTR) పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని (NTR Silver Coin) కేంద్రప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్థం.. శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ (Modi Govt) ఈ నాణేన్ని ముద్రించింది..
సోమవారం (రేపు) రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) చేతుల మీదుగా ఎన్టీఆర్ (NTR) వంద రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యలు ఢిల్లీ చేరుకున్నారు. ఇందుకు సంబంధించి ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన విషయం తెలిసిందే.
ఈ నెల 28న ఎన్టీఆర్ నాణెం విడుదలకు లక్ష్మీపార్వతికి ఆహ్వానం అందలేదు. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్లకు లక్ష్మీపార్వతి లేఖ రాశారు. ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి తనను ఆహ్వానించాలని లేఖలో లక్ష్మీపార్వతి కోరారు.