NTR Rs.100 Coin: ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం...
ABN , First Publish Date - 2023-08-28T13:30:01+05:30 IST
ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం లభిస్తుందని భారత ప్రభుత్వం హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్‌ఆర్ నాయుడు ప్రకటించారు.
న్యూఢిల్లీ: స్వర్గీయ ఎన్టీ రామారావు స్మారక నాణాన్ని (NTR Rs.100 Coin) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) సోమవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) సహా ఎన్టీఆర్ కుటుంబసభ్యులు (NTR Family Members) హాజరయ్యారు. అయితే ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో ఎన్టీఆర్ స్మారక నాణెం లభిస్తుందని భారత ప్రభుత్వం హైదరాబాద్ మింట్ చీఫ్ జనరల్ మేనేజర్ వీఎన్‌ఆర్ నాయుడు ప్రకటించారు. ఈరోజు (సోమవారం) ఎన్టీరామారావు స్మారక నాణెం విడుదల చేయడం జరిగిందన్నారు. హైదరాబాదులోని మింట్ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ స్మారక నాణెం దొరుకుతుందన్నారు. ఎన్టీఆర్ స్మారక నాణెం 12 వేల కాయిన్స్ ఇప్పటి వరకు ముద్రణ వేశామని చెప్పారు. 100 రూపాయల నాణెంలో 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్‌తో తయారుచేసినట్లు వెల్లడించారు. వంద రూపాయల నాణెం తయారు చేసేందుకు ఆర్థిక శాఖ అప్రూవల్ ఇచ్చిందన్నారు. హైదరాబాద్ మింట్‌లో మొదటిసారిగా ఎన్టీఆర్ స్మారక నాణాన్ని తయారు చేసినట్లు వీఎన్‌ఆర్ నాయుడు పేర్కొన్నారు.