Lokesh: ‘ఎన్టీఆర్ స్మారక నాణెం’ విడుదల... ఎన్టీఆర్ మనవడిగా గర్విస్తున్నా..

ABN , First Publish Date - 2023-08-28T12:50:19+05:30 IST

ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘‘ఎన్టీఆర్ స్మారక నాణెం’’ ఆవిష్క‌రించ‌డం తెలుగుజాతికి ద‌క్కిన గొప్ప గౌర‌వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా, తెలుగుదేశం పార్టీ వాడిగా, నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా గ‌ర్విస్తున్నానన్నారు.

Lokesh: ‘ఎన్టీఆర్ స్మారక నాణెం’ విడుదల... ఎన్టీఆర్ మనవడిగా గర్విస్తున్నా..

అమరావతి: ఎన్టీఆర్ శత జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ‘‘ఎన్టీఆర్ స్మారక నాణెం’’ (NTR commemorative coin )ఆవిష్క‌రించ‌డం తెలుగుజాతికి ద‌క్కిన గొప్ప గౌర‌వమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP Leader Nara lokesh) హర్షం వ్యక్తం చేశారు. తెలుగువాడిగా, తెలుగుదేశం పార్టీ వాడిగా, నంద‌మూరి తార‌క‌రామారావు మ‌న‌వ‌డిగా గ‌ర్విస్తున్నానన్నారు. ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, ప్ర‌జాసేవ‌కుడు, తెలుగుజాతిని ఒక్క‌తాటిపై న‌డిపించిన మ‌హానాయ‌కుడని కొనియాడారు. కోట్లాది హృద‌యాల్లో దేవుడై కొలువైన ఎన్టీఆరే తమ స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. శ‌క‌పురుషుడు శ‌త‌జ‌యంతిని చ‌రిత్ర‌లో నిలిచిపోయేలా ‘‘ఎన్టీఆర్ స్మారక నాణెం’’ విడుద‌ల చేసిన గౌర‌వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు, కేంద్ర ప్ర‌భుత్వానికి లోకేశ్ ధ‌న్య‌వాదాలు తెలియజేశారు.


కాగా.. ఎన్టీఆర్ స్మారక నాణాన్ని రాష్ట్రపతి ముర్ము ఈరోజు విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), ఏపీ బీజేపీ చీఫ్, ఎన్టీఆర్‌ కుమార్తె పురందేశ్వరి (Daggubati Purandeshwari), దగ్గుపాటి వెంకటేశ్వర్లు, నటుడు బాలకృష్ణ (Actor Balakrishna), నారా బ్రాహ్మణి (Nara Brahmini), ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు (NTR Family), పాల్గొన్నారు. టీడీపీ ఎంపీలు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, ఎంపీ రఘురామ కృష్ణరాజు, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, మాజీ ఎంపీ సుజనా చౌదరి, కంభంపాటి రామ్మోహన్ రావు, బాలకృష్ణ, అశ్విని దత్, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.

The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-08-28T12:50:19+05:30 IST