Home » Palnadu
మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్లో ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం అరెస్ట్ నుంచి తప్పించుకొని తిరుగుతున్న పరిణామాలపై ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తొలిసారి స్పందించారు. ఈవీఎంను పిన్నెళ్లి ధ్వంసం చేస్తున్న వీడియోను ఎన్నికల సంఘం విడుదల చేయలేదని స్పష్టం చేశారు.
పల్నాడు: జిల్లాలో ఎన్నికల అనంతరం వైసీపీ చేస్తున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఘటన బయటపడింది. ఇప్పటి వరకు ఈవీఎంల ధ్వంసం ఘటన వెలుగులోకి రాగా ఇప్పుడు మాచర్ల నియోజకవర్గంతోపాటు నరసారావుపేట నియోజకవర్గం పరిధిలో వైసీపీ చేసిన ధారుణాలు, దౌర్జన్యాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.
పల్నాడు జిల్లా: ఛలో మాచర్లకు తెలుగుదేశం పార్టీ గురువారం పిలుపిచ్చింది. ఈ నెల 13న జరిగిన పోలీంగ్ సందర్భంగా వైసీపీ గూండాల దాడులలో గాయపడిన బాధితులను పరామర్శించనున్నారు.
పల్నాడు జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. కేపి గూడెం, రాయవరం పోలింగ్ బూత్‌లపై దాడులు చేశారు. పోలింగ్ కేంద్రంలో ఉన్న టీడీపీ ఏజెంట్లపై హత్యాయత్నం చేశారు. టీడీపీ పోలింగ్ ఏజెంట్ రేక్యానాయక్పై వైసీపీ గూండాలు హత్యాయత్నం చేశారు.
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), అతని బ్రదర్స్‌ను ఏపీ పోలీసులు వెంటాడుతున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission of India) నుంచి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy) ఎపిసోడ్లో సినిమాను మించిన ట్విస్ట్‌లు నడుస్తున్నాయి. పిన్నెల్లి కోసం చేజింగ్ నడుస్తోంది. ఈవీఎం ధ్వంసం(EVM Damage Case) కేసులో నిందితుడైన పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు(AP Police) ప్రయత్నిస్తుండగా.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు పిన్నెల్లి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
మాచర్ల ఎమ్మెల్యే పిన్నె్ల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) మళ్లీ పరారయ్యారు. నియోజకవర్గంలోని రెంటచింతల మండలం పాల్వాయి గేటులో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనలో అరెస్ట్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీఈవో, డీజీపీకి క్లియర్ కట్‌గా ఆదేశాలు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Election 2024) జరిగిన పోలింగ్ (మే -13), ఆ తర్వాత రోజు నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్ద ఎత్తున చోటుచేసుకున్నాయి. అయితే మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (MLA Pinnelli Ramakrishna Reddy) ఆయన సోదరులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి సామాన్యులపై వరుసగా దాడులకు పాల్పడుతునే ఉన్నారు.
పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా మల్లిక గార్గ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించడమే తన ముందున్న మొదటి లక్ష్యమని తెలిపారు. లా ఆర్డర్ విషయంలో ఆంధ్రప్రదేశ్‌కు దేశంలో ప్రశాంతమైన రాష్ట్రంగా పేరు ఉండేదని ఆమె ప్రస్తావించారు.