Share News

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

ABN , Publish Date - Jul 10 , 2024 | 03:00 PM

పడుగురాళ్ల(Piduguralla) లెనిన్ నగర్‌లో డయేరియా(Diarrhea) కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేశ్ బాలాజీ(Collector Latkar Srikesh Balaji), ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్(MLA Yarapathineni Srinivas) డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

Diarrhea: పిడుగురాళ్ల లెనిన్ నగర్‌లో డయేరియా కలకలం..

పల్నాడు: పిడుగురాళ్ల(Piduguralla) లెనిన్ నగర్‌లో డయేరియా (Diarrhea) కలకలం రేపుతోంది. ఇప్పటికే పలువురు బాధితులు వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ లట్కర్ శ్రీకేశ్ బాలాజీ(Collector Latkar Srikesh Balaji), ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ (MLA Yarapathineni Srinivas) డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఇది ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టాలని, అతిసారకు గల కారణాలను త్వరగా నిర్ధరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే యరపతినేని సైతం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దీన్ని త్వరితగతిన అదుపు చేయాలని, పరిస్థితిని 48గంటల్లో అదులులోకి తేవాలని గురజాల ఆర్డీవోను ఎమ్మెల్యే ఆదేశించారు. అప్పటివరకు పిడుగురాళ్లలోనే ఉండాలని ఆర్డీవోకు సూచించారు.


రాష్ట్రంలో తిరుపతి, రాజమండ్రి, కాకినాడ, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో అతిసార వ్యాధి విభృజిస్తోంది. తాజాగా తిరుపతి పాస్ మనోవికాస్ స్వచ్చంధ సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురు చికిత్సపొందుతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కాకినాడ, రాజమండ్రి జీజీహెచ్‌లకు వాంతులు, విరేచనాలతో ప్రజలు వస్తున్నారు. దీనిపై స్థానిక అధికారులు చర్యలు చేపట్టారు. ఇక ఇటీవల జగ్గయ్యపేటలోనూ సుమారు 80డయేరియా కేసులు నమోదు కాగా.. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే తాగునీరు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తీసుకునే ఆహారంపై జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచిస్తున్నారు. కాచి వడపోసిన నీరు మాత్రమే తాగాలని, అలాగే వాతావరణం మార్పుల కారణంగా బయట తీసుకునే ఆహార పదార్థాలను కొద్దిరోజులు పక్కన పెట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 03:06 PM