Home » Peddapalli
మహిళా సంఘాల పనితీరు మెరుగుపరిచేందుకు అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. శని వారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వశక్తి మహిళా సంఘాలపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ లింకేజ్ నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటి వరకు 90 శాతం మేర రుణాలు పంపిణీ పూర్తి చేశారని, మిగి తా రుణాల పంపిణీ ఈనెల 15 వరకు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
మండల కేంద్రంలో కోర్టు ఏర్పాటుకు శనివారం నోడల్ అధికారి, సుల్తానాబాద్ సివిల్ కోర్టు జడ్జి గణేష్ సందర్శించారు. ప్రతిపాదనలో ఉన్న ముంజాల మధు, పచ్చిమట్ల సునీల్, ఇరుకుల్ల సత్యనారాయణకు చెందిన భవనాల్లో మౌలిక సౌకర్యాలను పరిశీలించారు.
విద్యార్థులకు న్యాయసేవలు, చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయమూర్తి టి.శ్రీనివాస్‌రావు అన్నారు. మండల న్యా యసేవా సమితి ఆధ్వర్యంలో శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వ హించారు.
ఆర్జీ-1లో ఫిబ్రవరిలో 110శాతం ఉత్పత్తి సాధించినట్టు ఆర్జీ-1 జీఎం లలిత్ కుమార్ శనివారం ఒక ప్రక టనలో తెలిపారు. 3.84లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాని గాను 4.22 లక్షల టన్నులు సాధించామని తెలిపారు. ఉద్యోగులు, అధికారులు కలిసి కట్టుగా రక్షణతో పని చేసి ఉత్పత్తి సాధించినందునకు జీఎం అభినందిం చారు.
వేవవిలో సింగరేణి ప్రాంతంలో నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. సింగరేణి కాలనీలకు నీటి సరఫరా చేసేందుకు గోదావరి మాత్రమే మార్గంగా ఉండడం, గోదావరినది ఎండిపోయిన పరిస్థితుల్లో గనుల నీటిని వాడుకోవాలని యాజమాన్యం భావించింది.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగిందని కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జెడ్పీ హై స్కూల్, గోదావరిఖని సెక్రర్డ్ హార్ట్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు.
గోదావరి ఖనికి చెందిన న్యాయవాది కిరణ్జీపై వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ న్యాయవాదులు గురువారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. దీంతో మూడు కోర్టుల్లో కార్యకలాపాలు నిలిచిపోయాయి. అనం తరం అఖిల భారత న్యాయవాదుల సంఘం (ఐలూ) ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు ఎదుట నిరసన తెలిపారు.
లక్షలు వెచ్చించి నిర్మించిన రైతువేదికలు అలంకార ప్రాయంగా మారాయి. మరుగుదొడ్లు నిర్మించినా నీటి సౌకర్యం లేక అలంకారప్రాయంగా మిగిలాయి.ఊరికి దూరంగా నిర్మించడంతో కొన్ని రైతు వేదికలు మందుబాబులకు అడ్డాలుగా మారుతున్నాయి.
గోదావరినదిలో నీరు లేక మహా శివరాత్రి పుణ్య స్నానాలకు భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ చొరవతో ప్రభుత్వం ఎల్లంపల్లి నీటిని దిగువ గోదావరిలోకి వదిలింది. గోదావరినదిలో నీరు లేని పరిస్థితిపై ఎమ్మెల్యే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రస్థాయి వైజ్ఞానిక సదస్సుకు జిల్లా సైన్స్ అధికారి, కన్నాల ప్రభుత్వ పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు బి. రవినందన్ రావు ఎంపికైనట్లు డీఈవో మాధవి ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఎస్సీఈఆర్టీలో నిర్వహించే వైజ్ఞానిక సదస్సుకు హాజరుకావాలని డీఎస్వోకు ఆహ్వానం అందినట్లు తెలిపారు.