Share News

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీపాదరావు కృషి

ABN , Publish Date - Mar 03 , 2025 | 12:14 AM

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభా స్పీకర్‌ స్వర్గీయ శ్రీపాదరావు కృషి చేశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పట్టణంలోని శ్రీపాద చౌరస్తా, ఆర్సీ కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి శ్రీపాదరావు కృషి

మంథని, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ శాసనసభా స్పీకర్‌ స్వర్గీయ శ్రీపాదరావు కృషి చేశారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మాజీ స్పీకర్‌ శ్రీపాదరావు జయంతి సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు పట్టణంలోని శ్రీపాద చౌరస్తా, ఆర్సీ కట్టలోని శ్రీపాదరావు విగ్రహాలకు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన నాయకుడు శ్రీపాదరావు అని, ఆయన ఉమ్మడి రాష్ట్ర శాసనసభ స్పీకర్‌గా సమర్థవంతంగా విధులు నిర్వహించారన్నారు. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వస్తే మంథని ప్రాంత ప్రజల ఆశీర్వాదం మేరకు తనకు శాసనసభ్యుడిగా అవకాశం కలిగిందన్నారు. శ్రీపాదరావు ఆశయ సాధనలో భాగంగా విద్య, వైద్యం, ఉపాధి పరంగా ఈ ప్రాంతంలో నివసించే అనేక మందికి మేలు చేస్తామన్నారు. తనకు ఉన్న శక్తి మేరకు మంథని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానన్నారు. మంథని రైతులకు సాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనేది శ్రీపాదరావు లక్ష్యమని, దానిని నెరవేర్చే దిశగా పని చేస్తామన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. మంథనిలోని సామాజిక ఆసుపత్రిలో పండ్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు వొడ్నాల శ్రీనివాస్‌, పెండ్రు రమాదేవీసురేష్‌రెడ్డి, శశిభూషన్‌కాచే, కొత్త శ్రీనివాస్‌, ఐలి ప్రసాద్‌, లింగయ్యయాదవ్‌, పోలు శివ, కుడుదుల వెంకన్న, ఉప్పట్ల శ్రీనివాస్‌, సంతోషిణి, గోటికార్‌ కిషన్‌జీ, రావికంటి సతీష్‌, ఎరుకల ప్రవీణ్‌, మంథని సత్యం, బండారి ప్రసాద్‌, కొండ శంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 03 , 2025 | 12:14 AM