ఆర్థికాభివృద్ధిలో కేంద్ర గిడ్డంగుల సంస్థ కీలకం
ABN , Publish Date - Mar 03 , 2025 | 12:18 AM
దేశ ఆర్థిక అభివృద్ధిలో కేంద్ర గిడ్డంగుల సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ స్పందన అన్నారు. గర్రెపల్లిలోని సిడబ్ల్యుసి గోదాములలో ఆదివారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సుల్తానాబాద్, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): దేశ ఆర్థిక అభివృద్ధిలో కేంద్ర గిడ్డంగుల సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజర్ స్పందన అన్నారు. గర్రెపల్లిలోని సిడబ్ల్యుసి గోదాములలో ఆదివారం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గర్రెపల్లిలో ఉన్న సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ (కేంద్ర గిడ్డంగుల సంస్థ) గోదాముల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్పందన మాట్లాడుతూ దేశంలో ఆహార ఉత్పత్తులను భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయడంలో గిడ్డంగుల సంస్థ సేవలు వెలకట్టలేనివని అన్నారు. గిడ్డంగుల సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాల్గొన్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అధికారులు రత్నాకర్ పోటే, గజేంద్ర తాయి వాడే తదితరులను గోదాం మేనేజర్ స్పందన సత్కరించారు. ఉద్యోగులు , హమాలీలు తదితరులు పాల్గొన్నారు.