Home » Phone tapping
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతం అయ్యింది. నల్లగొండ, హైదరాబాద్‌లలో రెండు చోట్ల ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్ దగ్గర పర్వతగిరి, సిరిసిల్ల, ఖమ్మంలో ఒక్కో చోట ట్యాపింగ్ సెంటర్ల ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొత్తం 7 ఫోన్ ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు ఖాకీలు కనుకొగన్నారు. నల్లగొండ విటీ కాలనీలో నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో విపక్ష నేతల కదలికలను గుర్తించడం వంటివే కాదు.. ఈ ఫోన్ ట్యాపింగ్‌తో మహిళలను సైతం పోలీసులు వేధించారని అధికారుల విచారణలో తేలింది. ఈ క్రమంలోనే నల్లగొండ జిల్లాకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు అరెస్ట్ అయ్యారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping) రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. నల్గొండ(Nalgonda) జిల్లా కేంద్రంగా ఆపరేషన్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో తేలింది. నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్లో(Hyderabad) వార్ రూమ్ ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు..
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం వేలాది ఫోన్లను ట్యాప్ చేసిందని.. మాజీ సీఎం కేసీఆర్ అధికార దుర్వినియోగం చేశారని విరుచుకుపడ్డారు.
Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయంటూ ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు మొరపెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. తన ఫోన్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు కూడా ట్యాపింగ్‌కు గురైనట్లు వెల్లడించారు. ‘‘గతంలో నా ఫోన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. నా ఫోన్ నుండి పొంగులేటికి ఫోన్ వెళ్లినట్లు, మాట్లాడినట్లు జరిగింది. దీనిపై గతంలో మేము ఫిర్యాదు చేశాము’’ అని తెలిపారు.
తీగ లాగితే డొంకే కదులుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో సంచలనం వెలుగు చూస్తోంది. నల్లగొండకి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు లిఫ్ట్ చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో నాయకుల ఫోన్ ట్యాప్ చేసి విన్నట్లు వారిపై అభియోగాలొచ్చాయి.
ఎస్ఐబీ వేదికగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డి్‌స్కల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా.. తాజాగా
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. కేటీఆర్ తనతో పాటు మరో ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు. అసలు ఆయనకు లా అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది.