ABN Big Debate: ఫోన్ ట్యాపింగ్‌పై సంచలన విషయాలు బయటపెట్టిన సీఎం రేవంత్
ABN , Publish Date - May 07 , 2024 | 08:41 PM
‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.
ABN Big Debate: ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy)సంస్థల ఎండీ, ప్రముఖ జర్నలిస్టు వేమూరి రాధాకృష్ణ (RK) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ డిబేట్’ (Big Debate) చర్చా కార్యక్రమానికి నేడు (మంగళవారం) తెలంగాణ సీఎం, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) విశిష్ఠ అతిథిగా విచ్చేశారు. ఈ డిబేట్‌లో పలు కీలక విషయాలను పంచుకున్నారు సీఎం రేవంత్.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమిని చవిచూసింది. బీఆర్ఎస్ ఓడిపోయి డిసెంబర్ 3 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంతమంది అధికారులు మాజీ సీఎం కేసీఆర్‌కు సహకరించారనే ఆరోపణలు వచ్చాయి. కొంతమంది అధికారులు చేసిన తప్పిదాలు భయటపడతాయనే కారణంతో వెంటనే కొన్ని ఫైళ్లను ధ్వంసం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. అయితే ఈ విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి పలు షాకింగ్ కామెంట్స్ చేశారు. అసలు ఫలితాలు వచ్చిన తర్వాత ఏం జరిగిందో సీఎం రేవంత్ వివరించారు.
‘‘డిసెంబర్ 3 ఫలితాలు వచ్చాయి. డిసెంబర్ 4న SIB కార్యాలయంలో వస్తువులను నాశనం చేశారు. ఈ విషయంపై పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదయ్యింది. కేసు దర్యాప్తులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసు మేము కావాలని తీసుకువచ్చింది కాదు. తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ ఫోన్ ట్యాపింగ్ లేదు. మంత్రుల శాఖల్లో నేను జోక్యం చేసుకోవడం లేదు. అవసరమైతేనే నా వద్దకు రావాలని మంత్రులకు చెప్పాను’’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ABN Big Debate:ఆ పోస్టుకు నేను ఎలా బాధ్యుడిని.. సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్
Read Latest Telangana News And Telugu News